News

VIZAG:విశాఖపట్నం లో త్వరలోనే మెట్రో పరుగులు, ప్రాజెక్ట్ ఖర్చు ₹14,309 కోట్లు

S Vinay
S Vinay

వైజాగ్ వాసులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే త్వరలోనే వైజాగ్ నగరం లో మెట్రో పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మెట్రో రైలు విధానం (2017) కింద 10 నగరాల్లో 13 కొత్త మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించింది మరియు ఆరు కొత్త ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి.అయితే ఇందులో విశాఖపట్నం కూడా ఉంది. పోర్ట్ సిటీలో పెరుగుతున్న జనాభా మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం కొత్త డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (detailed project report ) త్వరలో ప్రభుత్వానికి సమర్పించబడుతుందని AP మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తెలిపారు.ఈ detailed project report ప్రకారం ప్రాజెక్ట్ అంచనా వ్యయం ₹14,309 కోట్లు. ఈ మెట్రో ని సుమారుగా 77 కి.మీ మేర విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు మెట్రో డిపోలను ఏర్పాటు చేస్తున్నారు సుమారుగా 54 స్టాప్ లు ఉండే అవకాశం ఉంది.

మెట్రో రైలు అమలు తర్వాత పెరుగుతున్న జీడీపీ(GDP):
ap metro rail corporation మేనేజింగ్ డైరెక్టర్ యుజెఎం రావు మాట్లాడుతూ మెట్రో రైలు అమలు తర్వాత ప్రపంచంలోని మెట్రోపాలిటన్ నగరాలు గణనీయమైన GDPని నమోదు చేశాయి. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో మెట్రో రైలు గణనీయమైన వృద్ధిని సాధించింది మరియు రాబోయే సంవత్సరాల్లో వృద్ధి రేటు రెండు మూడు రెట్లు పెరగబోతోంది అని వ్యాఖ్యానించారు.

మెట్రో రైల్
భారతదేశం లో మొదటి మెట్రో కలకత్తా లో ప్రారంభమైనది. ప్రస్తుతం 12 నగరాల్లో మెట్రో పరుగులు తీస్తుంది. 2017 వ సంవత్సరంలో హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలో ఎక్కువ దూరం అలసట లేకుండా ప్రయాణించడం మెట్రో రైల్ యొక్క ప్రత్యేకత.

మరిన్ని చదవండి.

70 ఎకరాలు, 5 కోట్ల చెట్లు: ఏకంగా అడవినే సృష్టించిన సూర్యపేట వాసి -'దుశర్ల సత్యనారాయణ'

Share your comments

Subscribe Magazine

More on News

More