తెలంగాణ రాష్ట్ర తలసరి నీటి లభ్యత దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి ఓఎస్‌డి (ఇరిగేషన్) శ్రీధర్ రావు దేశ్‌పాండే అన్నారు.గృహ, తాగునీటి అవసరాల కోసం తీసిన నీటిలో కేవలం 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)ని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు గురువారం కోరారు.
హైదరాబాద్: రాష్ట్ర తలసరి నీటి లభ్యత దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి కి ఓఎస్‌డి (ఇరిగేషన్) శ్రీధర్ రావు దేశ్‌పాండే వెల్లడించారు . ఆదివారం ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) నిర్వహించిన సర్ ఆర్థర్ థామస్ కాటన్ 220వ జయంతి వేడుకలో 'దేశంలో తలసరి నీటి లభ్యత మరియు తలసరి నిల్వ సామర్థ్యం ఆవశ్యకత' అనే అంశంపై కీలక ప్రసంగం చేస్తూ దేశ్‌పాండే తెలంగాణ లో యొక్క నీటి లభ్యత గురించి అయన కీలక వ్యాఖ్యలు చేసారు . తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల్లో మొత్తం నీటి లభ్యత దాదాపు 1,300 టీఎంసీలు కాగా, నిల్వ సామర్థ్యం 950 టీఎంసీలు.
PM Kisan Shocking News: 3 లక్షల PM కిసాన్ అనర్హులైన రైతులను గుర్తించిన ప్రభుత్వం !
నీటి నిల్వ సామర్థ్యం పెంపు ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో 141 టీఎంసీలు, పాలమూరు-రంగారెడ్డిలో 68 టీఎంసీలు, డిండిలో 25.26 టీఎంసీల స్టోరేజీని ప్రతిపాదించారని శ్రీధర్ రావు దేశ్‌పాండే వెల్లడించారు.
Share your comments