తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన ప్రముఖ నేత నారా లోకేష్ ఇటీవల చేసిన ఓ ప్రకటన వివాదాస్పదమై ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వసతి దీవెన మరియు విద్య దీవెన పథకాలు రెండూ విస్తృతమైన మోసాలు తప్ప మరొకటి కాదని, అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తానని లోకేశ్ ప్రకటనలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన డబ్బులను నేరుగా కాలేజి ఖాతాల్లో జమ చేసేది. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడానికి కాలేజీ ఖాతాల్లో జమ చేయవల్సిన డబ్బులను ఆ ఖాతాల్లో వేయకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని తెలిపింది. కానీ ఈ పథకాల యొక్క నిధులను విద్యార్థుల ఖాతాల్లో సరిగ్గా వేయట్లేదని నారా లోకేష్ విమర్శించారు.
పర్యవసానంగా కాలేజీలకు ఫీజులు సరిగ్గా కట్టకపోవడంతో రెండు లక్షల మంది సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉండిపోయాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న విధానాన్ని రద్దు చేసి తిరిగి నేరుగా కాలేజీ ఖాతాలోనే డబ్బులు జమ చేసే పాత పద్దతిని ప్రారంభిస్తామని తెలియజేసారు.
ఇది కూడా చదవండి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాలంటీర్లకు శుభవార్త! అదేమిటంటే?
ముఖ్యమంత్రి జగన్ రూ. లక్ష కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు నారా లోకేష్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ ఆస్తులలో పాటు సీఎం జగన్‌కు బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి మరియు ఇడుపులపాయ వంటి ప్రముఖ నగరాల్లో విలాసవంతమైన ప్యాలెస్‌లు ఉన్నాయని ఆయన అన్నారు. దీనికి తోడుగా వైజాగ్ లో మరొకటి కడుతున్నారని టిడిపి నేత లోకేష్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి..
Share your comments