ఎండా వేడి ,ఉక్కపోత ద్వారా ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను చల్లటి వర్షపు జల్లులు తాకనునట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది , దీనితో ఎండా నుంచి ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది . గత కొన్ని రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల స్థాయిలు పెరుగుతున్న విషయం తెలిసిందే మరోవైపు మర్చి చివరి నాటికీ 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోనున్నాయి .
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 18 వరకు మధ్య, దక్షిణ భారతదేశంలో ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో ఆయా రాష్ట్రాల్లో 'హీట్ వేవ్' ప్రభావం తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది.వర్షాలతో పాటు పిడుగులు, ఉరుములు, భారీ ఈదురుగాలులు, కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా ఈసారి పడనున్నాయి. తేమ పొడిగాలుల కలయిక వలన భారీ ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్లో తెలిపింది. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 16, 17 తేదీల్లో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. 17న మాత్రం వర్షాలు మరింత భారీగా ఉంటాయని అంచనా వేశారు.
ఏపీ రైతులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి మద్దతు ధరకు పప్పు ధాన్యాల కొనుగోలు !
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మార్చి 16 నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు ఒకటిలేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్లో తెలిపింది. గాలులు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయని, దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
Share your comments