వేసవి కాలం మొదలు కాబోతుంది, సూర్యుడి వేడి భగ భగలు, తెలుగు రాష్ట్రాలపైనా అధికంగా ఉండబోతున్నాయి అని ఇప్పటికే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మార్చ్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మార్చ్ నెలనుండి సూర్యుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు. కనిష్ట ఉష్ణోగ్రత 24 సెంటీగ్రేడ్లు, మరియు గరిష్ట ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్ల్ వరకు చేరుకోనుంది. ముఖ్యంగా మార్చ్ మధ్యస్థానికి ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడ్లు వరకు చేరుకునే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. పరీక్షల సీసన్ కావడం వల్ల విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పరీక్షలకు వెళ్లే సమయంలో వాటర్ బాటిల్ మర్చిపోకుండా మీ వెంట తీసుకువెళ్లండి. వడ దెబ్బ నుండి కాపాడుకోవడానికి శరీరానికి కావాల్సిన ఎలెక్ట్రోలైట్లు, కొబ్బరిబోండాలు, మరియు ఓఆర్ఎస్ పౌడర్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ వర్షపాతం చాల తక్కువగా ఉండబోతుంది. కనుక పంట నూర్పిళ్ళు చేసే రైతులకు అనువుగా ఉంటుంది. ధాన్యం ఆరబెట్టుకోవడానికి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం, వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక రైతులు దీనిని దృస్థిలో ఉంచుకొని వ్యవసాయ పనులు చెయ్యవలసి ఉంటుంది
Share your comments