గత 24 గంటల నుంచి ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాగులు, వంకలు పొంగి పొర్లుతూ రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం ఏర్పడటం కారణంగా రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అల్పపీడనం కారణంగా ఇవాళ, రేపు కోస్తాలోని కొన్ని చోట్ల భారీ, మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ తోపాటు మెదక్, నల్గొండ, నిజామాబాద్, జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అధికంగా వర్షాలు నమోదు కావడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 48 గంటల్లో భారీ వర్షాలు ఉండటంతో ప్రజలు అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
Share your comments