హైదరాబాద్ : హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఈరోజు కూడా హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై తేలికపటు నుండి భారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతలు 22 నుండి 30 డిగ్రీల వరకు ఉంటాయి. ఆగ్నేయం నుండి గంటకు 8 నుండి 10 కి.మీ వేగాలతో గాలులు వీస్తాయి. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటు నుండి భారిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే మూడు రోజుల పాటు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మరియు బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.ప్రజలు తప్పను సరి అయితే తప్ప బయటకి రావొద్దు అని ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
రాగల 3 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సూర్యాపేటలో కొన్ని చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, వర్షం, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
ఆరెంజ్ అలెర్ట్: రాష్ట్రంలో 3 రోజులపాటు ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు..
ఏపీలో రెడ్ అలెర్ట్ :
విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర విపత్తుల సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఉరుములు మెరుపుల వర్షంతో కూడి "పిడుగులు" పడే అవకాశం ఉందని తెలిపారు. చెట్ల కింద ఎవరు ఉండవద్దని సూచించారు.
కృష్ణ జిల్లా,ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ జిల్లాలో రానున్న రెండు -మూడు గంటలవరకు భారీ నుండి అతిభారీ వర్షాలు,ఉరుముల కారణంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు
ఇది కూడా చదవండి:
ఆరెంజ్ అలెర్ట్: రాష్ట్రంలో 3 రోజులపాటు ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు..
Image credit: pexels.com
Share your comments