సిటిజెన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) దీనినే తెలుగులో పౌరసత్వ సవరణ చట్టంగా గా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, మరియు వార్త పత్రికల్లో ఎక్కువుగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఆక్ట్ పై చాల మంది వ్యతిరేకత చూపుతున్నారు, దినికి కారణాలు అనేకం. అయితే ముందుగా CAA అంటే ఏమిటి దాని వళ్ళ ఎవరికీ ప్రయోజనం అనేది ముందుగా తెలుసుకోవాలి.
పౌరసత్వ చట్టం 1955, లో సవరణ ద్వారా, మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నుండి ఇండియాకి వలస వచ్చిన, ముస్లిమ్స్, సిక్కులు, క్రైస్తవులు, మరియు కొన్ని ఇతర మతాల వారికి భారతీయ పౌరసత్వం కల్పించబడుతుంది. మాత సంఘర్షణల ద్వారా కానీ, మరియేవిధమైన కారణంచేతనైనా, పైన చెప్పబడిన దేశాల నుండి, 2014 డిసెంబర్ 31 లోపు మన దేశానికి వలస వచ్చిన వారందరికీ ఈ సవరణ ద్వారా భారతియా పౌరసత్వం లభిస్తుంది. ఇంటలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఈ ఆక్ట్ అమల్లోకి రాగానే, 30,000 కంటే ఎక్కువ మంది వలసదారులు లబ్ధిపొందుతారు.
ఈ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్ 11 న పార్లిమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అప్పటికే ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తి చెందుతూ ఉండటం, మరియు ఈ సవరణ చట్టానికి నియమాలు(Rules ) వెల్లడించని కారణంగా, సవరణలను అమల్లోకి తీసుకురావడం వీలుకాలేదు. అంతే కాకుండా పార్లిమెంట్లో ఈ చట్టం ప్రవేశపెట్టిన తర్వాత దేశాలంలో పలు చోట్ల అనేక అల్లర్లు, చోటుచేసుకున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది.
2024 లోకసభ ఎన్నికలకు ముందే ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దేశంలోని ప్రతి పౌరుడికి పౌరసత్వం నిర్ధారించడం సార్వభౌమ హక్కని అయన మాట్లాడరు. గత నాలుగు సంవత్సరాలుగా చట్ట నియమాల్లో ఎన్నో మార్పులు చేసి, అర్హులైన ప్రతిఒక్కరికి పౌరసత్వం అందించేలా రూపొందించారు. వచ్చే లోకసభ ఎన్నికల ముందే వలసదారులందరు, భారతియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరగబోతుంది.
Share your comments