ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలు ఎంతో చక్కగా రుచిగా ఉంటాయి. అందుకోసమే చాలామంది బర్రె పాలు తాగడానికి ఇష్టపడుతుంటారు.కానీ ఆరోగ్యానికి బర్రె పాలతో పోలిస్తే ఆవు పాలు ఎంతో శ్రేష్ఠమైనవి చాలామంది భావిస్తారు. నిజానికి ఏ పాలు ఆరోగ్యానికి మంచిది? బర్రె పాల.. బర్రె పాల అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆవు పాలల్లో 3 నుంచి 4 శాతం కొవ్వు ఉంటుంది. అదే పాలలో 7 నుంచి 8 శాతం కొవ్వు ఉంటుంది. అందుకోసమే బర్రె పాలు ఎంతో చిక్కగా ఉంటాయి.అధిక మొత్తంలో కొవ్వు కలిగినటువంటి ఈ బర్రె పాలను తీసుకోవడం వల్ల మన శరీర బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
బర్రె పాలలో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవు పాలతో బర్రె పాలు ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచుకోవచ్చు. రాత్రి నిద్రపోయే సమయంలో బర్రె పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. బర్రె పాలలో కొవ్వు అధికంగా ఉండటం వల్ల కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పాలు అరుగుదలకు కాస్త సమయం పడుతుంది. అందుకోసమే చిన్నపిల్లలకు వీలైనంతవరకు బర్రె పాలకు బదులుగా ఆవుపాలను ఇవ్వాలని నిపుణులు చెబుతుంటారు. అదేవిధంగా బర్రె పాలను ఎక్కువగా పెరుగు, నెయ్యి, పన్నీర్ వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
నిజాం కాలం నాటి బస్సు ను చూడడానికి ఎగబడిన జనం ...!
బర్రె పాలతో పోలిస్తే ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. శరీర బరువును తగ్గించుకోవడానికి ఆవుపాలు ఎంతో దోహదపడతాయి. ఆవుపాలలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల త్వరగా జీర్ణం అవ్వడానికి దోహదం చేస్తాయి. పిల్లలలో పెరుగుదలకు, జ్ఞాపకశక్తి పనితీరుకు ఆవుపాలు ఎంతో శ్రేష్ఠమైనవి అని చెప్పవచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఆవుపాలు దోహదపడతాయి. పోషకాల పరంగా ఆవుపాలు, బర్రెపాలు సమానంగా ఉంటాయి కనుక వేటిని తాగాలనే విషయాన్ని మనమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
Share your comments