కర్ణాటక రాజకీయం ఇప్పుడు మొత్తం పాల చుట్టే తిరుగుతుంది , ఎన్నికలు సమీపిస్తున్న వేళా నందిని పాలు vs అమూల్ పాలు అన్నట్లుగా రాజకీయం నడుస్తుంది , ఈ అంశం ఇప్పుడు కర్ణాటక రాజకీయం పరంగా ప్రకంపనలు సృష్టిస్తుంది .
అసలు వివాదం ఏమిటి ?
దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దారు అయినా అమూల్ ఇప్పుడు కర్ణాటకలో తమ పాలు పాల ఉత్పత్తులను విస్తరించాలని చూస్తుంది ఈ మేరకు సంస్థ ప్రకటించిందో లేదో కర్ణాటకకు చెందిన నందిని డైరీ ను అమూల్ ఆక్రమించేస్తాడని రాష్ట్ర రైతుల ఫెడరేషన్ అయిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లేకుండా పోతుందని విస్తృత ప్రచారంతో విపక్షాలు సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని పేద్ద ఎత్తున్న ప్రచారం చేసాయి దీనితో అక్కడి ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఎన్నికలు సమీపిస్తున్న వేల బీజేపీ నాయకులకుఈ అంశం పెద్ద సమస్యగా మారింది .
సహకార సంఘంగా నడుస్తున్న నందిని పాలు, పాల ఉత్పత్తులకు కన్నడనాట విశేష ఆదరణ ఉంది. కర్ణాటక ప్రజల జీవనం లో నందిని ఒక భాగంగా మారింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన అమూల్ పాలు, పాల ఉత్పత్తులను కర్ణాటకలో ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు చేతికి కొత్త ఆయుధం లభించింది. నందిని పాల ఉత్పత్తుదారుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంతటి తో ఆగకుండా ఈ అంశం కర్ణాటక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది , మరో వైపు బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాల డైరీ లు అయినా విజయ మరియు దొడ్ల డైరీ పాలు ఎలా విక్రయిస్తున్నారని వాళ్లకు లేని అడ్డు అమూల్ కు ఎందుకని విమర్శలకు సమాధానం ఇస్తున్నారు .
Share your comments