భారతదేశం నుండి గోధుమలను దిగుమతి చేసుకోవడాన్ని ఈజిప్ట్ దేశం ఆమోదించిందని వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా ప్రపంచ మార్కెట్లలో గోధుమల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఈ రెండు దేశాలు గోధుమల ప్రధాన ఉత్పత్తిదారులు మరియు ఎగుమతిదారులుగ ఉన్నాయి.గోధుమలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో ఈజిప్ట్ కూడా ఒకటి.ఈజిప్ట్ గోధుమలను రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల నుండి దిగుమతి చేసుకునేది కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా గోధుమల సరఫరా ఆగిపోయింది. గతంలో రష్యా నుండి ఈజిప్ట్ 1.8 బిలియన్ డాలర్ల విలువైన గోధుమలను మరియు ఉక్రెయిన్ నుండి 610.8 మిలియన్ డాలర్ల విలువైన గోధుమలను దిగుమతి చేసుకుంది.
ఈజిప్ట్ ఇంతకు ముందు కర్నాల్ బంట్ వ్యాధి కారణంగా భారత్ నుండి గోధుమలను ఎగుమతి చేసుకోవడానికి అంతగా సముఖంగా లేదు.ఈజిప్టు అధికారులు క్వారంటైన్ సౌకర్యాల తనిఖీలు నిర్వహించి మరియు ఇతర క్షేత్రాలను సందర్శించిన తర్వాత ఎగుమతికి ఆమోదం తెలిపింది.దేశంలో ఉత్పత్తి అవుతున్న గోధుమల నాణ్యతను పరిశీలించేందుకు అధికారులు యూపీ, మధ్యప్రదేశ్, పంజాబ్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
ప్రస్తుతం భారతదేశంలో గోధుమలు పండించే ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు గుజరాత్.దేశ వ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 107.59 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి అవుతుంది అయితే దీనిలో ఎక్కువ భాగం దేశీయ వినియోగానికి వెళుతుంది.
ఈజిప్ట్ మాత్రమే కాకుండా ఆఫ్రికన్ దేశాలు భారతదేశం నుండి 1 మిలియన్ టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవాలని చూస్తోంది.
ప్రస్తుతం భారతదేశం నుండి గోధుమలను దిగుమతి చేసుకుంటున్న టాప్ 10 దేశాలు:
బంగ్లాదేశ్
నేపాల్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
శ్రీలంక
యెమెన్
ఆఫ్ఘనిస్తాన్
ఖతార్
ఇండోనేషియా
ఒమన్
మలేషియా.
మరిన్ని చదవండి.
Share your comments