News

బ్రేకింగ్ న్యూస్:భారతీయ గోధుమలలో వైరస్.... తిరిగి వెనక్కి పంపిన ఆ దేశం!

S Vinay
S Vinay

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా దేశాలలో ఆహార ధాన్య కొరత ఏర్పడింది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఉంది. కొన్ని దేశాలు ధాన్య ఎగుమతుల కొరకై భారతదేశాన్ని ఆశ్రయించాయి.

రష్యా మరియు ఉక్రెయిన్ గోధుమల అతిపెద్ద ఉత్పత్తిదారులు. గ్లోబల్ గోధుమ మార్కెట్‌లో ఈ రెండు దేశాలకు పెద్ద వాటా ఉంది. ప్రపంచంలోని గోధుమలలో నాలుగింట ఒక వంతు ఈ దేశాల నుండి సరఫరా చేయబడుతుంది. ఇప్పుడు యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు గోధుమలు అందుబాటులో ఉన్న దేశాల నుంచి కొనుగోలు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో టర్కీ భారతదేశం నుండి గోధుమలను దిగుమతి చేసుకుంది.అయితే గోధుమలలో రుబెల్లా వైరస్ ఉందని పేర్కొంటూ భారతదేశానికి గోధుమలను తిరిగి పంపింది. S&P గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ నివేదిక ప్రకారం, ఒక టర్కిష్ నౌకలో 56,877 టన్నుల గోధుమలు లోడ్ చేయబడ్డాయి.

ఓడ టర్కీ నుండి గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు తిరిగి వచ్చింది. గోధుమలకు ఫైటోసానిటరీ సమస్యలు ఉన్నాయని మే 29 న భారతదేశం నుండి గోధుమ సరుకును తిరిగి ఇచ్చారు. రుబెల్లా వైరస్ కారణంగా భారత్‌కు గోధుమలను రవాణా చేసేందుకు టర్కీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిరాకరించింది.

భారతదేశం నుండి అనేక దేశాలకు గోధుమలు ఎగుమతి చేయబడ్డాయి. ఈజిప్టు సహా ఇతర దేశాలకు త్వరలో గోధుమ రవాణా చేరనుంది. అందిన సమాచారం ప్రకారం, గోధుమల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ దాదాపు 12 దేశాలు భారత్ నుంచి గోధుమలను డిమాండ్ చేశాయి. నిషేధం ఉన్నప్పటికీ, భారతదేశం 60,000 టన్నుల గోధుమలను ఈజిప్టుకు ఎగుమతి చేసింది.

మరిన్ని చదవండి.

ఈ వర్షాకాలం సీజన్ లో పత్తి పంటకి ప్రభుత్వ ప్రోత్సాహం!

ఐదు అంచెల పద్దతిలో సాగు విధానం!

Share your comments

Subscribe Magazine

More on News

More