గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వందవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ముద్రించిన 100 రూపాయల నాణేన్ని ఆవిష్కరించింది. ఈ ముఖ్యమైన స్మారక చిహ్నాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విశిష్ట వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం పంపించారు.
ఈరోజు నుండి సాధారణ ప్రజలకు ఈ ప్రత్యేకమైన ఎన్టీఆర్ స్మారక వంద రూపాయల నాణెం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ప్రకటించారు. ఇందులో హైదరాబాద్ లో ఈ నాణెం ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలిపింది. అలాగే ఆన్ లైన్లోనూ ఈ కాయిన్ ను ఎలా తెప్పించుకోవచ్చన్న వివరాల్ని మింట్ ఛీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. ఇందులో ఆయన ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఈ కాయిన్ కొనుగోలు కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
ఆన్ లైన్ లో ఎన్టీఆర్ కాయిన్ తెప్పించుకోవాలనుకునే వారు మింట్ అధికారి వెబ్ సైట్ లో ఆర్డర్ చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ కాయిన్ కావాల్సిన వారు మింట్ వెబ్ సైట్ https://indiagovtmint.in/en/commemorative-coins/ లోకి వెళ్లి దీన్ని ఆర్డర్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ కాయిన్ ను నిర్ణీత మొత్తం ఆన్ లైన్లోనే చెల్లించి ఆర్డర్ చేసుకునే వీలుంది. అలాగే ఆఫ్ లైన్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
ఇది కూడా చదవండి..
ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో సెల్‌ఫోన్లు బ్యాన్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ..
ఒక్కో నాణెం ధర రూ.4850గా నిర్ణయించారు. అధిక ధర ఉన్నప్పటికీ, అన్నగారిని అభిమానించే చాలా మంది ఈ నాణేన్ని కొనుగోలు చేస్తారనడంలో సందేహం లేదు. ఈ నాణేలు పసుపు, గోధుమ రంగులలో లభిస్తాయి. ఈ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్లుప్తంగా వ్రాయబడ్డాయి. ఈ నాణెంకు డిమాండ్ అధికంగా ఉండడంతో, ప్రస్తుతానికి ఒక వ్యక్తికి కేవలం ఒక నాణెం మాత్రమే అమ్మకాలను పరిమితం చేయాలని మింట్ అధికారులు నిర్ణయించారు.
ఇది కూడా చదవండి..
Share your comments