News

నాటు కోడి గుడ్లను అధిక ధరతో కొంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

KJ Staff
KJ Staff

సాధారణంగా చాలామంది బాయిలర్ కోళ్లకు బదులుగా నాటి కోళ్లను తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే బాయిలర్ కోడితో పోలిస్తే నాటి కోడి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుందని భావిస్తారు. అయితే ఇందులో కొంత వరకు వాస్తవం ఉన్నా కానీ కోడి గుడ్లలో కూడా నాటి కోడి గుడ్ల ఆరోగ్యానికి మంచివని, వాటిని తినడం వల్ల సరైన పోషకాలు మన శరీరానికి అందుతాయని చాలామంది భావిస్తారు. ఈ క్రమంలోనే బాయిలర్ గుడ్డు తో పోలిస్తే నాటి గుడ్డుకు అధిక డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తారు.

ఈ కోడిగుడ్ల విషయంలో అయితే నాటి కోడి గుడ్లలో ఎక్కువ శాతం పోషకాలు,ప్రొటీన్లు దొరుకుతాయని భావించి వాటిని కొనుగోలు చేయడం అనేది కేవలం మీ అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణ గుడ్లు నాటుకోడి గుడ్లలో ఒకే పరిమాణంలో పోషకాలు ఉంటాయి.కొన్నిసార్లు గుడ్డు పరిమాణంలో తేడా ఉంటుంది కానీ వాటిలో ఉన్నటువంటి పోషకాలు లో ఏమాత్రం తేడా ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణ కోడి గుడ్లు తెలుపు రంగులో ఉండగా నాటు కోడి గుడ్లు కొద్దిగా గోధుమ రంగులు కలిగి ఉంటాయి. సాధారణ గుడ్లతో పోలిస్తే నాటు కోడి గుడ్లు కొద్దిగా సైజులు చిన్నవిగా ఉన్నప్పటికీ రెండింటిలోనూ ఒకే విధమైనటువంటి ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం విలువలు ఉంటాయని కేవలం మన అపోహ వల్ల మాత్రమే నాటి కోడి గుడ్లకు అధిక డబ్బు వెచ్చించి మార్కెట్లో వాటికి డిమాండ్ కల్పిస్తున్నామని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine

More on News

More