News

ఆ వార్తలు ఫేక్.. రైతులు అసలు నమ్మవద్దు

KJ Staff
KJ Staff

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల నగదును కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం రూపంలో అందిస్తోంది. మూడు విడతలుగా ఈడబ్బులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున జమ చేస్తూ ఉంటుంది. ఈ పథకం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏడు విడతల నగదును రైతులకు ఇచ్చింది .

8వ విడత డబ్బులను త్వరలో కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఎనిమిదవ విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జమ చేస్తున్నట్లు పలు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. రూ.2 వేలను కేంద్రం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. చాలామంది రైతులు ఇది నిజమేమోనని అనుకుని తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్మును చూసుకుంటున్నారు.

డబ్బులు రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు వెళ్లి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 8వ విడత డబ్బులను జమ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, అవి నిజం కాదని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి చెప్పారు.

డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. ఏప్రిల్ చివరి వారంలో 25 నుంచి 28 మధ్య డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ దీనికి అడ్డంకి కాదని, ఈ పథకం ఎప్పటినుంచో ఉందని ఆయన చెప్పారు. మీడియాలో వచ్చే ఫేక్ వార్తల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కైలాష్ చౌదరి సూచించారు.

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తిరుగుతూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతిసారి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తారు. మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో.. ఏప్రిల్ చివరివారంలో పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశముంది.

Share your comments

Subscribe Magazine

More on News

More