తెలంగాణ రాష్ట్రము లో ఎంతో ఘనంగా భక్తి ,శ్రద్దలతో నిర్వహించే పండుగ బతుకమ్మ ,తెలంగాణ సంస్కృతిని & సంప్రదాయాలను చాటి చెప్పే పండుగ ఇది కేవలం పండుగ మాత్రమేకాదు ఉద్యమం పరంగా చూస్తే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కూడా ఏ పండుగ ప్రత్యేక పాత్ర పోషించిందంటే అతిశయోక్తికాదు కాదు ,తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆదివారం తో ప్రారంభం అయి ఈ పండుగ 9 రోజుల పాటు కొనసాగుతుంది . మొదటి రోజు ఎంగిలి పులా బతుకమ్మ తో మొదలై 9 వ రోజు సద్దుల బతుకమ్మ తో ముగుస్తుంది .
బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి నృత్యాలు, పాటలు పాడుతూ పండుగను ప్రజలు జరుపుకుంటారు. అయితే పండుగా జరుపుకోవడానికి భిన్న కథనాలు ప్రచారం లో ఉన్నాయి .
బతుకమ్మ చరిత్ర &ప్రచారం లో ఉన్న కథలు :
తెలంగాణ లో ఒక గ్రామం లోని బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీనికి ప్రతీకగా ఉరి ప్రజలు అంత కలిసి ఒక చోట గుమిగూడి పూలను పేరుస్తూ ఆ గ్రామం లోని మహిళలు పాటలోతో తెలిపిన నిరసన్నను బతుకమ్మ గ 9 రోజులు నిర్వహించారని అదే బతుకమ్మ గ ప్రాచుర్యం పొందింది .
ప్రచారం లో ఉన్న మరో కథ :
ఒక ఊర్లో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క చెల్లెలు ఉండేది. ఆమె అంటే ఆ అన్నలకు పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం ఆమెపైన విపరీతమైన అసూయ ఏర్పడింది ఒక రోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు దీనితో ఇద్దరిమధ్య గొడవ జరగడంతో ఇంటి నుంచి వెళ్ళిపోయింది .
కొన్నిరోజుల తరువాత ఆ అన్నలు తిరిగొచ్చారు. తమ చెల్లెలు కనబడకపోయేసరికి చెల్లి ఎక్కడ అని భార్యల్ని నిలదీశారు. చెల్లెలు ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకొని వెతకడానికి బయలుదేరుతారు. అప్పటి నుంచి తిండీ తిప్పలు, నిద్రాహారాలు లేకుండా.. చెల్లెలి కోసం వెతుకుతుంటారు. దాహం వేసి ఓ ఊరి పొలిమేరలోని బావిలో నీరు తాగుతుండగా.. పెద్ద తామరపువ్వు నీటిపై తేలుతూ వారి దగ్గర కొచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెరువు చూపింది కాబట్టి 'బతుకమ్మ' అయ్యింది! ఇదో జానపద గాథ.
నేడు అటుకుల బతుకమ్మ .. ఈరోజు బతుకమ్మకు వాడే పూలు ఏమిటో తెలుసా !
మరోకథ :
మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం లో భాగం గ పూలతో ఆటపాటలతో కొనసాగిన నృత్యాన్ని నేటికీ మహిళలు కొనసాగిస్తున్న సాంప్రదాయంగా కొందరు రచయితలు అభిప్రాయపడుతారు . .
Share your comments