ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయాలన్న ఎంతో కష్టంగా మారిపోయింది. వ్యవసాయంలో పెట్టుబడులు అధికం కావడమే కాకుండా రైతుకు ఎలాంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యవసాయం చేయడం ఎంతో కష్టంగా మారిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చాలామంది వ్యవసాయదారులు వ్యవసాయం చేయడానికి ఎద్దులు లేక, ట్రాక్టర్ పిలిపించి వ్యవసాయ పనులు చేయించే ఆర్థిక స్తోమత లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే అవసరం వారిని కాడెద్దులుగా మార్చింది. వ్యవసాయ పనుల కోసం సొంత చెల్లెలిని, భార్యను కాడెద్దులుగా మార్చే వ్యవసాయ పనులు సాగిస్తున్నాడు గద్వాల్ కు చెందిన ఓ రైతు.
అవసరం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది అని చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు.
గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. గ్రామంలో వీరేష్ అనే యువ రైతు తన పొలంలో సిడిపత్తి పెట్టాడు. ఈ పొలంలో వ్యవసాయం చేయడం కోసం తనకు సొంతంగా ఎద్దులు లేవు. అలాగని ఎద్దులను బాడుగకు తీసుకుందామన్న లేదా ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు చేద్దామన్న అతడి దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు.
ఒకవేళ ఎద్దులు బాడుగకు తీసుకుందామన్న అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో రైతు వీరేష్ చేసేది ఏమీ లేక తన భార్యను తన చెల్లెలను కాడెద్దులుగా మార్చుకున్నాడు. ఈ విధంగా వారిద్దరూ నాగలి లాగుతూ వెళ్తుండగా వీరేష్ వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఇలా తన పొలంలో వ్యవసాయం చేయడానికి సొంత వారిని ఎద్దులుగా మార్చిన ఈ ఘటన వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చెప్పడానికి చక్కని ఉదాహరణ.ఇంత కష్టపడి వ్యవసాయం చేస్తూ పంట పండిస్తే చివరికి రైతుకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు వ్యవసాయ పనులను పక్కనపెట్టి ఏదైనా ఉపాధి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు.
Share your comments