దేశంలో కొత్త పెన్షన్ విధానాలు అమలులో ఉండగా, చాలా మంది ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానాలు వద్దని, పాత పెన్షన్ విధానాలు మళ్ళి అమలులోకి తేవాలి అని డిమాండ్ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ విధానాలను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాలను అమలులోకి తెచ్చాయి. ముఖ్యంగా రాజస్థాన్, జార్ఖండ్,హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాలను అమలు చేస్తున్నాయి.
ఉద్యోగులు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడితో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త పెన్షన్ విధానాలను సవరించి మరియు ఉద్యోగులకు అనేక రాయితీలను కేంద్రం ఇవ్వనున్నట్లు ప్రచారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు తమపై భారం పడకుండా ఈ కొత్త పెన్షన్ విధానంలో మార్పులు తేవాలని ఆలోచిస్తున్నాయి. ఈ కొత్త మరియు పాత పెన్షన్ విధానాలలో వ్యత్యాసం ఏమిటి? ఎందుకని ఉద్యోగులు పాత పెన్షన్ పద్దతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ పథకం ప్రకారం ఒక ఉద్యోగి, తన పని కాలంలో డిపాజిట్ చేసిన మొత్తంలో 60 శాతం వరకు ఆ ఉద్యోగి పన్ను లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీలో పెట్టుబడి పెడతారు.
ఇది కూడా చదవండి..
ఎల్ఐసి ధన్ వర్ష పాలసీ.. దీని గురించి మీకు తెలుసా?
పాత పెన్షన్ స్కీంలో ఉద్యోగి యొక్క పదవీ విరమణ సమయంలో సగం జీతాన్ని పెన్షన్ గా పొందుతాడు. కానీ కొత్త పెన్షన్ స్కీంలో ఆలా కాకుండా డీఏ మరియు జీతంలో 10 శాతాన్ని తగ్గిస్తున్నారు. దానితో పాటు ఈ కొత్త పెన్షన్ స్కీంలో డీఏ 6 నెలల తరువాత పొందాలి అనేది లేదు. పైగా స్టాండర్డ్ పెన్షన్ కు కూడా ఈ కొత్త పెన్షన్ స్కీంలో లేదు. అదే ఓల్డ్ పెన్షన్ స్కీంలో ఐతే రిటైర్ అయిన ఉద్యోగి మరణించిన తర్వాత కూడా అతని కుటుంబానికి పెన్షన్ వస్తాది. కాబట్టి ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకం వద్దు అని, పథ పెన్షన్ పథకాన్ని అమలు చేయమని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments