News

హైదరాబాద్ వేదికగా ఆసియాలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షో 'వింగ్స్ ఇండియా' !

Srikanth B
Srikanth B

విమానయాన పరిశ్రమ భాగస్వాములకు భవిష్యత్ సంవత్సరాల్లో విమాన ప్రయాణం లో  విప్లవాలు సృష్టించే ,సాంకేతికత  యొక్క పురోగతిపై ఈ సదస్సు ను నిర్వహించనున్నారు .డెమానిస్ట్రేషన్ విమానాలు, సిఇఒ ఫోరం, స్టాటిక్ డిస్ ప్లే, ఏరోబాటిక్స్,లు ఏ సదస్సులో ప్రదర్శించబడతాయి.

మార్చి 24 నుంచి 27 వరకు ఆసియాలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షో అయిన వింగ్స్ ఇండియా-2022 కు బేగంపేట విమానాశ్రయంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. మొదటి రెండు రోజులు వ్యాపారానికి, మిగిలిన రోజులు  సాధారణ ప్రజలకు ప్రదర్శనార్థం అందుబాటులో వుండనున్నాయి . పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లు వింగ్స్ ఇండియా యొక్క ఐదవ ఎడిషన్, ద్వైవార్షిక పౌర విమానయాన ప్రదర్శన (ఫిక్కీ)ని నిర్వహిస్తున్నాయి.

విమానయాన పరిశ్రమ భాగస్వాములకు భవిష్యత్ సంవత్సరాల్లో విమాన ప్రయాణాన్నిసులభంచేయడానికి సహాయపడే సాంకేతిక ఆధారిత పురోగతిపై ఈ సదస్సు అవగాహనా కలిగిస్తుందని భావిస్తున్నారు.

మౌలిక సదుపాయాలు కోసం , పోలీసులు  మరియు ఇతర సేవలలో పాల్గొనే  వివిధ అధికారుల  మంగళవారం ప్రాథమిక సమావేశానికి హాజరయ్యారు, ఫిక్కీ ఈ కార్యక్రమం మరియు దాని లక్షణాలగురించి హాజరైన వారికి వివరించింది.

125 కు పైగా అంతర్జాతీయ మరియు స్థానిక ఎగ్జిబిటర్లు, అలాగే 11 ఆతిథ్య , 15 కు పైగా దేశ ప్రతినిధి బృందాలు, మరియు అనేక రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు నుండి  హాజరవుతారని ఆశిస్తున్నారు . గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన మంత్రులతో పాటు పరిశ్రమ నాయకులను ఒకచోట చేర్చనుంది.

Alert! మీ పాన్ కార్డును ను ఆధార్ తో లింక్ చేయండి , లేకపోతే రూ .1000 ఫైన్ ! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on News

More