ఇటలీ నగరంలో ఒక మహిళా లక్సరీ గ జీవించాలని భావించింది దానికోసం పెద్ద స్కేచ్ వేసింది .. ఉద్యోగంతో సంబంధం లేకుండా నెల నెల ప్రభుత్వం అందించే పింఛను తీసుకుంటే హాయిగా జీవించొచ్చు అనుకుంది అయితే దొంగతనం ఎన్నోరోజులు దాగదు ఎట్టకేలకు 15 సంవత్సరాల తరువాత అసలు విషయం బయట పడింది .
48 ఏళ్ల ఆ మహిళ తాను అంధురాలినంటూ 15 ఏళ్ల క్రితం వైద్యుడి సంప్రదించి ధ్రువీకరణ పత్రం పొందింది. సామాజిక భద్రత క్రింద పింఛనుకు దరఖాస్తు చేసుకుంది.
ఆమె నిజంగానే అంధురాలు అని నమ్మిన అధికారులు పింఛను మంజూరు చేశారు. మొత్తంగా 15 ఏళ్లలో ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు (రూ. 1.8 కోట్లు) పింఛన్ రూపంలో కొల్లగొట్టింది. ఇదిలా ఉండగా ఒక రోజు ఆమె తన సెల్ ఫోన్‌ను స్క్రోల్ చేయడం, ఫైళ్లపై సంతకాలు పెట్టడాన్ని అధికారులు గమనించారు. దీంతో ఆమె బండారం బయటపడింది దీనితో అక్కడి అధికారులు అవాక్కయారు ఎప్పుడు తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు మొదటగా ఆమెకు వికలాంగురాలు గ సర్టిఫికెట్ మంజూరు చేసిన అధికారిని విచారించనున్నారు .
Share your comments