ఆకలిని అతిపెద్ద భూతంగా భావిస్తారు, ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడైన, ఎంత పేదవాడైన సరే ఆకలి ముందు అంత ఒక్కటే, మనషి అహర్నిశలు కష్టించేది, ఈ జానెడంత పొట్టను నింపుకోవడానికి. ఆకలి విలువ తెలిసిన వ్యక్తి, తన కడుపునింపుకోవడంతో పాటు ఇతరుల కడుపు నింపడానికి ప్రయత్నిస్తాడు.
విధి ఎంత విచిత్రమైనది అంటే, కొంతమంది దగ్గర ఎంత సంపద ఉన్నా తనకు నచ్చింది తినడానికి లేకుండా ఒంటినిండా రోగాలతో బాధపడుతుంటే, మరోపక్క పూటగడిస్తే చాలనుకున్న పేదవాడు గొడ్డుచాకిరి చేసినాసరే అన్నం దొరకని పరిస్థితి వస్తుంది. ఆహారం ఇంత విలువైనది కాబట్టే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము.
ప్రపంచంలో ఇప్పటికి ఎంతమంది ఆహారం దొరక్క, ఆకలితో తమ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం వలన ఆ దేశ ప్రజలు పడుతున్న ఆకలి కష్టాల గురించి తరచు మనం టీవీ ల్లో చూస్తూనే ఉన్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం ప్రపంచంలో 46 మిలియన్ల మంది జనం ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచం అభివృద్ధి పేరుతో ఎంతో ముందుకు వెళ్తున్న, ఆహారం దొరక్క నిద్రలోనే కన్నుమూసే వారు ఇంకా ఉండటం ఎంతో చింతించవలసిన విష్యం.
ఆకలిని అరికట్టి, పేదరికాన్ని నిర్ములించాలన్న దృఢ సంకల్పంతో ది హాంగర్ ప్రాజెక్ట్ అనే లాభరహిత సంస్థ, 2011 లో మే 28 న ప్రపంచ ఆకలి దినోత్సవంగా ప్రకటించింది. ఆకలిని బాధలని నిర్ములించడానికి పరిష్కర మార్గాల్ని కనుగొనడం, ఆహార భద్రత బలోపేతం చేసే సంస్థలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను ఈ రోజు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి ఏడాదికి ఒక థీమ్ ను ఏర్పాటు చేసి దానిని సాధించడానికి కృషి చేస్తారు. ఆకలితో భాదపడుతున్నవారికి సాయపడాలన్న ఉదేశ్యంతో ఎన్నో కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ ఏడాది థీమ్ వచ్చేసి "అభివృద్ధి చెందుతున్న తల్లులు, మరియు అభివృద్ధి చెందుతున్న ప్రపంచం" బిడ్డకు జన్మనివ్వబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, కానీ పేదరికంలో మగ్గుతున్న ఎందరో తల్లులు ఇప్పటికే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి తల్లులు మరియు వారి పిల్లలు ఎన్నో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనేలా చేస్తుంది. అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించడానికి మరియు ఆకలిని తరిమికొట్టడానికి మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్ధిక అవసరాలపై ద్రుష్టి సారించి ఆరోగ్యం కరమైన జీవితం జీవించేలా చెయ్యడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం.
ఆహార భద్రత పెరగడానికైనా లేదా దెబ్బ తినడానికైనా రైతులు ప్రధాన పాత్ర పోషిస్తారు. రైతులు తమకు అందుబాటులో ప్రకృతి వనరులను సమగ్రవంతంగా వినియోగించుకోవడానికి నూతన సాంకేతికథమీద ద్రుష్టి సారించవలసిన అవసరం ఉంది. దీనికి తగిన శిక్షణ పొందవలసి ఉంటుంది. పేదరికాన్ని నిర్ములించడానికి విద్యని అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని పేదరికం నుండి బయట పడేలా చెయ్యాలి.
Share your comments