సాధారణంగా పచ్చని చెట్లను పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మనం మన ఇంటి చుట్టూ వివిధ రకాల మొక్కలను పెంచుతూ ఉంటాము. అయితే మన ప్రపంచంలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. వీటన్నింటిలో కెల్లా ప్రపంచంలో ఎంతో ఎత్తయిన చెట్టు ఉత్తర అమెరికా... కాలిఫోర్నియా రాష్ట్రంలోని రెడ్ వుడ్ నేషనల్ పార్క్ లో ఉంది. ఎత్తయిన చెట్టు అంటే సుమారు 100 అడుగులు ఉంటుంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే.
ఎత్తైన చెట్టు అంటే అమెరికాలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎంతో ఎత్తయిన చెట్టు అని చెప్పవచ్చు. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ఈ చెట్టు పేరు హైపెరియన్. అది కోనిఫెరస్ కోస్ట్ రెడ్ వుడ్ జాతి చెట్టు. సైంటిఫిక్ నేమ్ సెకోయా సెంపెర్విరెన్స్. ఈ చెట్టు ఏకంగా 115.85 మీటర్ల ఎత్తు. అడుగుల్లో అయితే... 380 అడుగులు ఉండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టుగా గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ చెట్టు ఎత్తును 2006వ సంవత్సరంలో అధికారులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చెట్టుగా గుర్తించారు.
సాధారణంగా మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఒక చెట్టు సంవత్సరానికి 20 కేజీల దుమ్ము, 20 టన్నుల కార్బన్ డై-ఆక్సైడ్‌ని పీల్చేసుకుంటుంది. అలాగే... మనకు 700 కేజీల ఆక్సిజన్ ఇస్తుంది. ఈ విధంగా మనం ఒక చెట్టును పెంచుకోవటం వల్ల సుమారుగా మూడు లక్షల రూపాయల వరకు ఈ సంవత్సరం ఆదాయం పొందవచ్చు. అదేవిధంగా బయట వాతావరణంతో పోలిస్తే చెట్టుకింద వాతావరణం నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి చెట్టు తన చుట్టూ ఉన్నటువంటి ఒక లక్ష చదరపు మీటర్ల గాలిని శుభ్రపరుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు అందించే చెట్లను మనం పెంచడం వల్ల భావితరాలకు మంచి వాతావరణాన్ని ప్రసాదించినట్లెనని నిపుణులు చెబుతున్నారు.
Share your comments