భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణులకు నీరు జీవనాధారం. నీరు లేకపోతే భూమి మీద జీవమే ఉండేది కాదు. సమస్త జీవజాలానికి ప్రాణాధారమైన నీటి ప్రాముక్యతను తెలియపరచడానికి ప్రతీ సంవత్సరం, మార్చ్ 22 న ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటాము.నీటిని సంరక్షించుకోవడం మన భాద్యత ఆ భాధ్యతను విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది.
భూమండలం మొత్తం 80% నీటితో నిండి ఉంది కానీ దానిలో అతికొద్ది శాతం మాత్రమే తాగేందుకు అనువైనది. ఆ కొద్దీ పాటి నీటిలో కూడా అధిక శాతం వాతావరణంలోని తేమగా మరియు మబ్బులుగా గాలిలోనే ఉంటుంది. మిగతా నీరు నదుల్లోను, చెరువులు, మరియు భూమి అడుగునా భూగర్భ జలాలుగా ఉంటుంది. ఇంత కొద్దీ పాటి నీటిని మనం ఎంతో స్పృహతో మరియు బాధ్యతతో వాడుకోవడం ఎంతో అవసరం. కానీ మనం మాత్రం బాధ్యతారాహిత్యంగా, నీటిని వృధా చేస్తూనే ఉన్నాం, చెరువులను పూడ్చి అపార్ట్మెంట్లు కడుతున్నాం, వర్షపు నీరు భూమిలోకి ఇంకెందుకు వీలులేకుండా, రోడ్లు, బిల్డింగులతో భూమిని కప్పేస్తున్నాం. వీటన్నిటి ఫలితంగా, ఎంతోమంది ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. ఇప్పుడు బెంగుళూరు ప్రజలు నీటికోసం పడుతున్న కష్టాలను ఒక ఉదారణగా చెప్పుకోవచ్చు. తప్పు ఎవరిదైనా దాని ఫలితం మనమంతా అనుభవిస్తున్నాం.
మరి దీనికి పరిష్కరమే లేదా అంటే, దానికి ఒకటే సమాధానం, ప్రకృతి మనకు అందించిన వనరుల్లో అతి ముఖ్యమైనది నీరు, అటువంటి నీటిని మన అవసరాలకు తగ్గట్టు వినియోగించుకుంటూ, నీటి సంరక్షణ చర్యలు చెప్పటగలిగితే, భవిష్యత్తులో నీటి ఎత్తడిని తాగించ్చవచ్చు.
Read More:
నీరు తాగడం వాళ్ళ కలిగే ప్రయోజనాలు
ప్రపంచ జల దినోత్సవం ప్రధాన లక్ష్యం:
1993 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, మార్చ్ 22 ను వరల్డ్ వాటర్ డే గా ప్రతిపాదించారు. ప్రపంచంలోని ప్రతిఒక్కరికి శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన తాగు నీటిని అందించడంతో పాటు, నీటి ప్రాముఖ్యత కల్పించడం ప్రపంచ జల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.ఇప్పటికి కూడా భూమి మీద 2.2 మిలియన్ల జనం శుభ్రమైన తాగునీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. నీరు ఒక దివ్యౌషధం, మంచి నీటిని తాగడం ద్వారా కొన్ని వేల రాగాలు మన దరిచేరవని మన ఆయుర్వేదం చెపుతుంది, అదే నీరు శుభ్రమైనది కాకపోతే కొన్ని వందల రోగాలు కలుగచేస్తుంది. సాంకేతికత స్థిరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా, ప్రతీ ఒక్కరికి మంచి తాగునీటిని అందిచలేకపోవడం దురదృష్టకరం. ఈ సమస్యకు మార్గాన్ని కనిపెట్టేందుకు మరియు నీటి వాడుకపై అవగాహన పెంచేందుకు జల దినోత్సవం ఉపయోగపడుతుంది. జల దినోత్సవం సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ర్యాలీలు, వర్కుషాపులు, ప్రజల్లో చెతన్యం తీసుకురావడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు డ్రాయింగ్ కంపిటిషన్స్, ద్వారా నీటి ప్రాముఖ్యతను తెలియపర్చవచ్చు. చిన్ననాటి నుండే నీటి నీటి విశిష్టత గురించి పిల్లలకు తెలిచేయ్యడం ఎంతో అవసరం.
నీటి లభ్యతను పెంచడం ఎలా?
నీరు మనకు ప్రకృతి అందించిన వనరుల్లో అతి కీలకమైనది. నీటి వృథాను తగ్గించి, పునరుత్పాదకతను పెంపొందించడం చాల ముఖ్యం. కాలి ప్రదేశాల్లో మొక్కలు నాటడం ద్వారా భూగర్భజలాలను పెంచవచ్చు, చెట్ల వేర్లు వర్షపు నీటిని పట్టి ఉంచి భూమిలోకి ఇంకెందుకు తోడ్పడ్తాయి. ప్రతీ ఇంటికి ఒక ఇంకుడు గుంతను ఏర్పరుచుకోవడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకెందుకు వీలుంటుంది. నదులపై ఆనకట్టలు నిర్మించడం, వాటర్ రిజర్వాయర్ నిర్మించడం ద్వారా నీటి వృధా తగ్గి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగాయపడుతుంది. నీటిని సంరక్షించడం అనేది కేవలం ప్రభుత్వం భాద్యతే కాదు, ప్రజలు కూడా నీటి సంరక్షణలో భాగం కావాలి. ప్రభుత్యం మరియూ ప్రజలు కలసి కట్టుగా పనిచేస్తేనే నీటి సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోగలం.
Share your comments