కొత్త సంవత్సరం అంత శుభం జరగాలని , సంవత్సరం మొదటి రోజు ఎలా గడిపితే సంవత్సరం మోత అదేవిదం గ ఉంటుందని నమ్మేవాళ్ళు మొదట గ కొత్త సంవత్సరం నాడు దేవాలయాలకు వెళ్తుంటారు .. గల్లీ లోని ఆలయాలు మొదలుకొని ప్రముఖ ఆలయాలు సైతం కొత్త సంవత్సరం నాడు భక్తులతో కిట కిట లాడుతుంటాయి .. అయితే తెలంగాణనలో తిరుపతి తరువాత తిరుపతి గ భావించే యాదాద్రి క్షేత్రానికి నూతన సంవత్సరం మరియు ఆదివారం కావడంతో భక్తులు పొటెత్తారు.
నూతన సంవత్సరం షాకింగ్ న్యూస్ :రూ.25 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ...
2023 కొత్త ఏడాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పొటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి(Yadagirigutta Lakshmi Narasimhaswamy) దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉచిత ధర్మ దర్శనం కోసం రెండున్నర గంటల సమయం పట్టనుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Share your comments