తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి నర్సింహా స్వామి ఆలయం ఎట్టకేలకు రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించడం లో సఫలమయ్యింది . తెలంగాణ రాజధానికి కూతవేటు దూరంలో ఉండడంతో తమ సెలవుదినాన్ని ఆహ్లదకరము గ గడపడానికి నగరవాసులు ఇక్కడికి అధికముగా వస్తుంటారు .
నిన్న ఆదివారము కావడంతో వరంగల్-హైదరాబాద్ హైవేపై పలు జిల్లాల నుంచి ప్రజలు ఆలయానికి చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజే రూ.1.16 కోట్ల నగదు, ఇతర రూపాల్లో భక్తులు ఆలయానికి సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీకమాసం పురస్కరించుకుని ఆలయాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారిగా లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. ఈనెల 29న ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ .. !
రద్దీ దృష్ట్యా భక్తులు తమ వాహనాలను కొండపై నిలిపేందుకు స్థలం లేక ఇబ్బందులు పడ్డారు. చాలా మంది భక్తులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ దిగువకు నిలిపి ఉంచారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆలయానికి వెళ్లడంతో వరంగల్-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Share your comments