తెలంగాణ వంటకాలు వండడం ప్రఖ్యాతి గాంచిన కరీంనగర్ నివాసి యాదమ్మకు ఘోర అవమానం జరిగింది. హైదరాబాద్ మహా నగరంలో నిర్వహిస్తున్న బిజెపి సమావేశాల్లో జాతీయ నేతలకు తెలంగాణ వంటకాలు రుచి చూపిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే . ఈ మేరకు కరీంనగర్ కు చెందిన యాదమ్మకు అవకాశం కల్పిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
కానీ నోవాటెల్ హోటల్ లోపలికి అనుమతించలేదని, తమ బృందానికి పాసులు ఇవ్వకుండా గోరంగా అవమానించాడని….. బండి సంజయ్ కుమార్ పై యాదమ్మ ఆరోపణలు చేసింది. దీంతో ఆమె తన బృందంతో రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బండి సంజయ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇవాళ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ బహిరంగ సభ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి లక్షల్లోజనాలు వస్తున్నారు. అటు హైదరాబాద్ లో పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు.
కాగా బీజేపీ బహిరంగకు సుమారు 10లక్షల మందికి పైగా జనసమీకరణ, మరోవైపు దేశ ప్రధాని హాజరవనున్న సభ. అయితే బీజేపీ నేడు నిర్వహించదల్చిన భారీ బహిరంగ సభకు వాన టెన్షన్ పట్టుకుంది.
భర్తను అద్దెకిచ్చిన బ్రిటన్ మహిళ - రోజు రెంట్ రూ.3 వేలు !
నిన్నటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా శ్రేణులు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
అయితే సభలకు ముందువరకు సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో గురువారం నుంచి రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లోను వర్షం పడుతోంది. ఇదిలా ఉండగా మరో రెండు, మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు.
Share your comments