భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఈ ఆధార్ కార్డు లేనిదే మనకి ఈ పని జరగదు. మనం ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్నా, దానికి ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలీ. ఇప్పుడు ఆధార్ కార్డు అనేది కేవలం గుర్తింపుకే కాకుండా, ఇది ఏటిఏం కార్డులా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆధార్ కార్డును ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఆధార్ కార్డుతో విత్‌డ్రా అంటే ఏటిఏంకు వెళ్లి కార్డుతో డబ్బులు తీయడం కాదు. ఈ సౌకర్యాన్ని మనం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా డబ్బు పొందవచ్చు. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఇది ఒకరకమైన డిజిటల్ చెల్లిపు మార్గం. ఇది కూడా యూపిఐ ప్లాట్ఫార్మ్ మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇది మనం డబ్బుల చెల్లిపుల కోసం ఆధార్ వేలిముద్రల ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది.
ఈ సేవలు అందరికి చెల్లుతుందా అంటే అందరికి కాదు, ఈ AePS సేవలను కేవలం ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏమిటంటే తమ ఆధార్ నెంబర్ అనేది వారి బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయించుకున్నవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వారికి ఉన్న ఖాతాకు ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్ సెటప్ చేస్తే ఈ సేవలను పొందవచ్చు.
ఇది కూడా చదవండి..
రైతులకు కలిసొచ్చిన ప్రభుత్వ మద్దతు ధర!
ఆధార్ కార్డుతో డబ్బులు ఎలా విత్‌డ్రా చేయచ్చు అంటే, బ్యాంక్ అధీకృత బిజినెస్ కరస్పాండెంట్ దగ్గర మైక్రో ఎటిఎం పరికరాలు ఉంటాయి. వీటిని స్వయంగా కస్టమర్ లావాదేవీలను సులభం చేయడానికి బ్యాంకులే ఏర్పాటు చేశాయి. మైక్రో ఎటిఎం ద్వారా ఆధార్ కార్డు ఆధారిత చెల్లింపు సాధ్యం అవుతుంది. అంటే, డబ్బు తీసుకోవడమే కాదు, వేరొకరికి పంపడం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది.
ఈ AePS సేవల ద్వారా మనం ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు మరియు నగదు జమ కూడా చేసుకోవచ్చు. దీనితోపాటు ఆధార్ నుండి మరో ఆధార్ కు నగదు కూడా బదిలీ చేయవచ్చు. ఈ AePS లావాదేవీల కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదు, బ్యాంకు ఖాతాతో ఆధార్ నంబర్ను లింక్ చేయడం మాత్రం తప్పనిసరి. కాబట్టి వినియోగదారులకు ఆధార్ సంఖ్య, బ్యాంక్ పేరు, లావాదేవీ సమయంలో వేలిముద్రలు అవసరం.
ఇది కూడా చదవండి..
Share your comments