ఇప్పటివరకు మీరు నీళ్ల ఎటిఎం ,డబ్బులు డ్రా చేసుకోవడానికి ఎటిఎం లను చూసే ఉంటారు కానీ ఎప్పుడైనా పాల ఎటిఎం గురించి విన్నారా ? అయితే ఈ కధనం మీకోసమే మధ్యప్రదేశ్ ,బేతుల్ అనే గ్రామంలోని యువకుడు పాల ఎటిఎం ద్వారా లక్షలలో సంపాదిస్తున్నాడు.
పాలు విక్రయించేందుకు కదిలే పాల ఏటీఎం మిషన్‌ను తయారు చేసిన ఈ రైతు కొడుకు పేరు రోహిత్ యాదవ్. ఈ యంత్రం రోజుకు దాదాపు 500 లీటర్ల పాలు మార్కెట్లో లభించే ధర కన్నా రెండు రూపాయల అధిక ధరకు విక్రయించి మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు . తక్కువ కష్టం తో సులువుగా డబ్బులను మాత్రమే ముందుగా చెల్లిచుకునే ఈ యంత్రం ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు యువకుడు.
రోహిత్ బీఎస్సీ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు.. ఆ తర్వాత సంపాదనతో పాటు ప్రజలకు మేలు రకం పాలు అమ్మేందుకు కొత్తగ ఏదైనా చేయాలనీ ఆలోచించడం మొదలు పెట్టాడు . అటువంటి పరిస్థితిలో, అతను వాటర్ ATM లాగానే పాల ATM రూపొందించాలని ఆలోచనకు వచ్చాడు తన కుటుంబ సహాయంతో, అతను వాటర్ ATM మెషిన్ వలె పనిచేసే పాల ATM ను రూపొందించాడు దీనితోనే ఇంటింటికి పాలను సరఫరా చేయడం ప్రారంభించాడు గతంలో రోహిత్ ఈ యంత్రం కోసం ఉద్యమం క్రాంతి యోజనలో పథకం క్రింద లోన్ తీసుకున్నాడు ఐడియా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఏకంగా మూడు కొత్త ఎటిఎం మెషిన్ లను రూపొందించి తన వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకోవని భావిస్తున్నాడు.
విజయవంతంగా సిద్ధం చేశాడు. ఈ యంత్రం సహాయంతో రోహిత్ ఇంటింటికీ ప్రజలకు పాల సౌకర్యాన్ని అందించడం ప్రారంభించాడు. అందిన సమాచారం ప్రకారం రోహిత్ ఈ యంత్రం కోసం ఉద్యమం క్రాంతి యోజనలో రుణం తీసుకుని మూడు పాల ఏటీఎంలను సిద్ధం చేస్తున్నాడు.
Share your comments