News

స్వచ్ఛ-భారత్-మిషన్-అర్బన్ 2.0 లో చురుగ్గా పాల్గొన్నయువత

Srikanth B
Srikanth B
Swachh-Bharat-Mission-Urban 2.0
Swachh-Bharat-Mission-Urban 2.0

చెత్త రహిత నగరాల కోసం ర్యాలీ నిర్వహించడానికి 5,00,000 మందికి పైగా యువత మొట్టమొదటి భారతీయ స్వచ్ఛతా లీగ్‌లో చేరారు నగరాలను చెత్త రహితంగా మార్చే దిశగా స్వచ్ఛ-భారత్-మిషన్-అర్బన్ చేస్తున్న ప్రయత్నాలు కొత్త ఊపును అందుకుంటున్నాయి.

కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించిన, ఎస్.బి.ఎం-అర్బన్ 2.0 యొక్క తొలి ఎడిషన్ 'భారతీయ-స్వచ్ఛతా-లీగ్' శుభ్రమైన, పచ్చని, చెత్త రహిత నగరాలను రూపొందించే లక్ష్యం దిశగా, దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువ విద్యార్థులు, స్వచ్చంద కార్యకర్తలు, యువనాయకులు, ప్రముఖులను సమీకరించింది. 2022 సెప్టెంబర్, 17 వ తేదీ, సేవా దివాస్ నుంచి 2022 అక్టోబర్, 2 వ తేదీ గాంధీ జయంతి వరకు పక్షం రోజుల పాటు కొనసాగుతున్న 'స్వచ్ఛ-అమృత్-మహోత్సవ్' వేడుకల్లో భాగంగా, చెత్త లేని బీచ్‌ లు, కొండలు, పర్యాటక ప్రదేశాల కోసం ర్యాలీ నిర్వహించడానికి, 1,800 కు పైగా నగరాల నుండి యువత శక్తిని, ఈ ఇంటర్-సిటీ, లీగ్ ఆధారిత స్వచ్ఛతా ఛాలెంజ్ విజయవంతంగా వినియోగించుకుంది.

లక్షలాది మంది యువత పరిశుభ్రమైన, చెత్త లేని పర్వత ప్రాంతాల కోసం శ్రమించారు. జమ్మూ-కశ్మీర్‌ లోని గందర్‌ బల్, పహల్గామ్, అనంత్‌ నాగ్, దూరువేరి నాగ్, బిజ్‌-బెహరా వంటి పలు నగరాల్లో స్వచ్ఛత గురించి అవగాహన కల్పించడానికి వేలాది మంది పౌరులతో ర్యాలీలు జరిగాయి. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, త్రిపుర, అస్సాం, సిక్కిం, నాగాలాండ్‌ లలో యువశక్తి భారతీయ స్వచ్ఛతా-లీగ్ చుట్టూ జాతీయ ఉత్సాహం వెల్లివిరిసింది.


భారతదేశ వ్యాప్తంగా ఈ బృందాలు సామూహిక చెత్త ఏరివేత, పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాయి. లక్షలాది మంది యువకులు తమ నగరంలోని బృందాలకు మద్దతుగా నిలిచారు. జార్ఖండ్‌కు చెందిన జమేషెడ్‌పూర్ జాగ్వార్స్ జట్టు, ఒడిశాకు చెందిన టీమ్ పారాదీప్ టైటాన్స్, తమిళనాడుకు చెందిన టీమ్ కోయంబత్తూరు, టీమ్ రామేశ్వరం, తెలంగాణా కు చెందిన టీమ్ సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ నుంచి టీమ్ స్వచ్ఛ విశాఖ వారియర్స్ ఐ.ఎస్.ఎల్. కి విశేషమైన కృషిని అందించాయి.

"10 వ తరగతి అర్హతతో డ్రోన్ పైలెట్ గ మారవచ్చు "-DFI ప్రెసిడెంట్ స్మిత్ షా

యువకుల నేతృత్వంలో జరిగిన ఈ పోటీలో ఉత్తమ జట్లను జాతీయ ఖ్యాతి ఉన్న జ్యూరీ సభ్యులతో కూడిన స్వతంత్ర ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోటీల పాల్గొనే బృందాల స్థాయి, కార్యాచరణ ప్రత్యేకత, పరిశుభ్రత కార్యక్రమాల ప్రభావం ఆధారంగా, విజేతలఎంపిక జరుగుతుంది. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతల క్షేత్ర స్థాయి అమలు పై ప్రచార ప్రభావం ఆధారంగా యువత మరింత దృష్టి సారించే భాగస్వామ్యాన్ని ఈ మిషన్ ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు.

"10 వ తరగతి అర్హతతో డ్రోన్ పైలెట్ గ మారవచ్చు "-DFI ప్రెసిడెంట్ స్మిత్ షా

Share your comments

Subscribe Magazine

More on News

More