పంట బాగా పండాలంటే విత్తనం బాగుండాలి. పంట బాగా పెరిగితే నాణ్యమైన దిగుబడులు వచ్చి, అధిక ధరలను పొంది రైతు సుభిక్షంగా ఉంటాడు. రైతుల మంచి కోరుతూ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. రైతు అన్ని విధములుగా అభివృద్ధి చెందాలంటే రైతులకు ముఖ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల నాణ్యతను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం వై.ఎస్.ఆర్ అగ్రిటెస్టింగ్ లాబ్స్లను ఏర్పాటు చేసి రైతులకు అందాకా నిలుస్తుంది. రైతులకు కావాల్సిన అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాలు ద్వారా అందిస్తుంది.
భారతదేశంలోనే మొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ లాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతులకు అవసరమ్యే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందించేలా వై.ఎస్.ఆర్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనుంది. రైతులకు సేవలందించేందుకు నియోజకవర్గానికి ఒక అగ్రిలాబ్ చొప్పున ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, కమలాపురంలలో ల్యాబ్లను ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాల పరీక్షలను నిర్వహిస్తూ సేవలను ప్రారంభించారు. ముద్దనూరులో మాత్రం ల్యాబ్ బిల్డింగ్ పనులను పూర్తి చేసింది, త్వరలోనే దీనిని కూడా ప్రారంభించి రైతులకు సేవలు అందించనున్నారు.
ఈ వై.ఎస్.ఆర్ అగ్రిటెస్టింగ్ లాబ్స్ లో మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఇన్పుట్ ను ఇక్కడ పరీక్షించుకునే వీలు కల్పించడం వల్ల సాగుపై రైతులకు మరింత నమ్మకం కలుగుతుంది. రైతులు గతంలో నకిలీ విత్తనాలు, ఎరువులు వాడి ఆర్ధికంగా చాల నష్టపోయారు. ఇప్పుడు ఈ ల్యాబ్ లో ఉచితంగా పరీక్షించుకుని నాణ్యమైన విధానాలను మార్కెట్లో కొనుగోలు చేస్కోవచ్చు. ఇక్కడా విత్తనాలే కాకుండా ఎరువులు మరియు కక్రిమి సంహారక మందులను కూడా పరీక్షించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
PM కిసాన్ తాజా అప్‌డేట్: జనవరి చివరిలోగా పీఎం కిసాన్ ...
ఈ అగ్రి ల్యాబ్ లో మూడు దశల్లో వితను, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరీక్షిస్తారు. ఆ తరువాత మార్కెట్లోకి విడుదల చేస్తారు. అల మార్కెట్లోకి విడుదలైన వాటిని జిల్లా స్థాయి ఇంటిగ్రేటెడ్ లాబీలో పరీక్షించి నాణ్యతగా ఉంటె సర్టిఫికెట్ ను జారీ చేస్తారు. మొదటి యాక్ట్ శాంపిల్ రాష్ట్ర స్థాయిలో సేకరించి పంపుతారు. వీటిని పరీక్షించి నివేదికలు రాష్ట్రస్థాయి అధికారులకు పంపుతారు. నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్ లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు తదితర వాటి నమూనాలను ఎలాంటిరుసుం లేకుండా ల్యాబ్ టెక్నికల్ అనలిస్ట్ ద్వారా పరీక్షలునిర్వహించి ధ్రువీకరిస్తారు. ఇంటిగ్రేటెడ్ లబ్స్ను రైతు భరోసా కేంద్రాలకు అనుసంధామ్ చేసారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా ఆర్బీకే సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments