News

నేడు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం డబ్బులు..

Gokavarapu siva
Gokavarapu siva

ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి మరియు విద్యదివేన వంటి పథకాలు అమలులో ఉన్నాయి. రైతుల కోసం ఐతే రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి రైతు భరోసా పథకం ద్వారా సహాయం అందిస్తుంది ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో మహిళలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ జనవరి రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు.

రాష్ట్రంలో పేద మరియు మధ్య తరగతి మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంతో రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు రూ. 45 వేల ఆర్థిక సహకారాన్ని అందజేస్తారు. ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయనుంది.

ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ మైదానంలో 10.15 గంటల నుంచి మ.12.05 వరకు బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమాల తరువాత ముఖ్యమంత్రి ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త: త్వరలో వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ డబ్బులు..

ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ సీఎం జగన్ ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి మహిళల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చాలా మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. వారికి ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని మహిళలు ఈ పథకంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుకే వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త: త్వరలో వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ డబ్బులు..

Share your comments

Subscribe Magazine

More on News

More