మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వర్చువల్ ద్వారా కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనున్నారు. ఈ ఏడాది 80,032 మందికి రూ.192.08 కోట్లను జగన్ విడుదల చేశారు. ఈ డబ్బులు నేరుగా నేతన్నల అకౌంట్లలో జమ కానున్నాయి. గత రెండేళ్లలో ఈ పథకం కింద నేతన్నలకు రూ.383.99 కోట్లు ప్రభుత్వం అందించింది. మంగళవారం అందించే రూ.192.08 కోట్లను కలిపితే ఇప్పటివరకు రూ.576.07 కోట్లు అందించినట్లు అవుతుంది.
ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్ల పాటు ఈ డబ్బులను అందించనున్నారు. అంటే ఐదేళ్లలో రూ.1,20,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం డబ్బులను దేనికైనా ఉపయోగించుకోవచ్చని, నేతన్నలకు అండగా నిలవడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ.. సంక్షేమ పథకాలు ఆపడం లేదని స్పష్టం చేసింది. అప్పుడు చేసి అయినా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ఆపే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది.
వైఎస్సార్ నేతన్న నేస్తంకు అప్లై చేసుకోవడం ఎలా?
గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి
అధికారులు దరఖాస్తును పరిశీలించి లబ్ధిదారుల జాబితాలో పేరు చేరుస్తారు.
గ్రామ, వార్డు సచివాలయంలో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తారు.
అర్హులకు అందకపోతే మరో నెల రోజులు దరఖాస్తు చేసుకోవడానికి టైమ్ ఇస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్స్
ఆధార్ కార్డు
అడ్రస్ ధ్రువీకరణ పత్రం
మగ్గంకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
బీపీఎల్ సర్టిఫికేట్
బ్యాంకు అకౌంట్ వివరాలు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాప్
మొబైల్ నెంబర్
Share your comments