News

మే 30 న రైతు భరోసా డబ్బులు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

Srikanth B
Srikanth B
మే 30 న రైతు భరోసా డబ్బులు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?
మే 30 న రైతు భరోసా డబ్బులు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ నిధులతో కలిపి రైతుభరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతులకు మూడు విడతలలో రూ . 13500 ను పెట్టుబడి సాయంగా అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత డబ్బులను మే 30 తేదీన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు .

వైఎస్సార్‌ రైతుభరోసా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం,ఈ నెల 30వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు 2023-24లో తొలివిడతగా 52.31 లక్షలమందికి రూ.3,934.25 కోట్లు జమచేయనున్నారు .


రైతు భరోసా పథకం స్టేటస్ ఎలా చెక్ చేయాలి :

YSR రైతు భరోసా PM కిసాన్ పథకం కోసం మీ స్టేటస్ తనిఖీ చేయడానికి అనుసరించాల్సిన దశలు:

1వ దశ: ముందుగా, మీరు నమోదిత రైతు అయి ఉండాలి

2వ దశ: మీరు www.ysrrythubharosa.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి

3వ దశ: మీరు ఎగువ కుడి మూలలో ఉన్న మెను-బార్‌పై క్లిక్ చేయాలి.

4వ దశ: తర్వాత, మీరు "నో యువర్ స్టేటస్" ఎంపికపై క్లిక్ చేయాలి

5వ దశ: “మీ రైతుభరోసా స్థితిని తెలుసుకోండి” ఎంపికపై క్లిక్ చేయండి

6వ దశ: మీరు ఇప్పుడు మీ "ఆధార్ నంబర్"ని నమోదు చేసి, "సమర్పించు" బటన్‌ను క్లిక్ చేయాలి.

7వ దశ: మీరు ఇప్పుడు చివరి ఇన్‌స్టాల్‌మెంట్ మరియు రాబోయే వాయిదాల కోసం మీ ఖాతా సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.

రైతులకు శుభవార్త .. పీఎం కిసాన్ 14వ విడత అప్డేట్ ..!

ప్రస్తుతం ఈ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని ఇచ్చింది. రైతుభరోసా సైట్‌లో గ్రీవెన్స్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు తీసుకుంది. ఏదైనా కారణం చేత పథకం వర్తించకపోతే తమ సమీప రైతుభరోసా కేంద్రంలోని వీఏఏను సంప్రదించి గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

ఎవరైనా రైతులకు ఈ పథకానికి అర్హత ఉండి వారికి డబ్బులు అందకపోతే లేదా కొత్తగా పొలం పాస్ బుక్ చేయించుకున్న దానికి సంబంధించిన పత్రాలు తీసుకోని వెంటనే రైతు భరోసా పథకంకు అప్లై చేసుకోండి.

రైతులకు శుభవార్త .. పీఎం కిసాన్ 14వ విడత అప్డేట్ ..!

Share your comments

Subscribe Magazine

More on News

More