ప్రస్తుతకాలంలో వ్యవసాయం వైపు చాలామంది యువత మొగ్గు చూపుతుంది. ఒకప్పుడు వ్యవసాయం చేస్తున్నాడంటే తక్కువగా చూసేవాళ్లు. వ్యవసాయమా అని చులకనగా చూసేవాళ్లు. కానీ కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి. యువత కూడా వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతోంది. ఉద్యోగాలు కూడా వదిలేసి వ్యవసాయం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎక్కడో సిటీలో ఉద్యోగం చేసే బదులు.. సొంత ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవించవచ్చని భావిస్తున్నారు.
అయితే ఎన్ని కష్టాలు వచ్చినా.. కొంతమంది వ్యవసాయాన్ని మాత్రం వదులుకోరు. మన ఇండియాలో వ్యవసాయం మీద జీవించే జనాభా ఇప్పటికీ ఎక్కువమంది ఉన్నారు. వర్షాలు వచ్చి పంట నష్టపోయినా, అప్పులైనా సరే వ్యవసాయాన్ని మాత్రం వదులుకోరు. అలాంటి ఒక ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ లోని సీహోర్ జిల్లా అష్టా మున్సిపాలిటీ పరిధిలోని నానక్ పూర్ గ్రామంలో నివసిస్తున్న శైలేంద్ర కుష్వాహా తండ్రి పదేళ్ల క్రితం మరణించాడు. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి మరణంతో వారసత్వాన్ని కొనసాగిస్తూ శైలేంద్ర కూడా వ్యవసాయం చేస్తున్నాడు. తన ఇద్దరి చెల్లెళ్లతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. ఇలా చెల్లెళ్లతో కలిసి వ్యవసాయం చేస్తూ తల్లి, చెల్లెళ్లను పోషిస్తున్నాడు.
ఎద్దులు కొనడానికి డబ్బులు లేకపోవడంతో తన ఇద్దరి చెల్లెళ్లను కాడెద్దులుగా మార్చి వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు చెల్లెళ్లు ముందు చెరోపక్క ఉండి లాగుతుండగా.. అన్న శైలేంద్ర అరక దున్నుతున్నాడు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది.
తనకు ఉన్న నాలుగు ఎకరాల పోలంలో తన చెల్లెళ్లతో కలిసి శైలేంద్ర సోయాబిన్ పండిస్తున్నాడు. నాలుగు ఎకరాలు ఇలాగే అరక దున్నుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లాలో అయిన సెహారో లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఎద్దులు కొనేందుకు డబ్బులు లేవని, అందుకే చెల్లెళ్లతో ఇలా చేయాల్సి వస్తుందని శైలేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Share your comments