సాధారణంగా మనకి తెలిసినంతవరకు ఒక మామిడి చెట్టుకు ఒక రకం కాయలు కాస్తాయి. కొన్ని చోట్ల ప్రయోగాలు చేసి ఒక మామిడి చెట్టుకు మూడు లేదా నాలుగు రకాలు కాస్తాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తాత ఏకంగా ఒక మామిడి చెట్టుకు 300 రకాలను కాయిస్తున్నాడు. ఈ తాత ఏమైనా శాస్త్రవేత్త అని ఆలోచిస్తున్నారా, ఈ తాత 7వ తరగతి ఫెయిల్. ఈ విషయం తెల్సుకున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
ఈ తాతకు 83 సంవత్సరాలు. ఆయన హాజీ కలీముల్లా పేరు ఈ తాత ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. మలిహాబాద్ అనే గ్రామం లక్నో నుండి 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరిలో ఈయన నాన్నగారికి నర్సరీ ఉంది. 7వ తరగతి ఫెయిల్ కావడంతో తండ్రితో కలసి నర్సరీకి వెళ్ళేవాడు. ఈ తరుణంలో ఆయనకు ఈ చెట్ల మీద ఆసక్తి పెరిగింది. వాటి గురించి మరింతగా తెలుసుకోవడం మొదలు పెట్టాడు.
ఈ తాత 1957లో 7రకాల మామిడి పండ్లు కాసే చెట్టును అభివృద్ది చేశాడు. ఆ ఊరిలో 1960లో వచ్చిన వరదల కారణంగా ఆ చెట్టు నాశనమైంది. ఆ తరువాత ఆయన పేదరికానికి గురయ్యారు. మరొక వైపు పెళ్ళి జరిగింది. డబ్బుల కోసం మరియు కుటుంబాన్ని పోషించడానికి కూలి పని చేసేవారు. ఆ తరువాత 27ఏళ్ళు ఆయన తన జీవిత పోరాటంలో మునిగిపోయాడు. అన్నేళ్ళు గడిచినా ఆయనకు చెట్ల మీద ప్రేమ తగ్గలేదు.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త: భారీగా పెరిగిన పత్తి ధర..
1987సంవత్సరంలో కలీముల్లా స్నేహితుడు భోపాల్ వెళ్ళిపోతూ తనకున్న 5ఎకరాల భూమిని కలీముల్లాకు కౌలుకు ఇచ్చి వెళ్లాడు. ఇతనికి ఎంతగానో ఇష్టం ఉన్న నర్సరీని ఆ భూమిలో ఈ తాత ప్రారంభించాడు. 13 ప్రత్యేకమైన మామిడి చెట్లను అభివృద్ది చేశాడు. అదేవిధంగా 300 రకాల మామిడి పండ్లను ఒకే చుట్టుకు కాసే విధంగా అభివృద్ధి చేశారు. ఈ కళను సహకారం చేసుకోవడానికి తాతకు 18 సంవత్సరాలు పట్టింది.
ఈ తాత అభివృద్ధి చేసిన ఈ చెట్లను ఐశ్వర్య, నమో(నరేంద్ర మోడీ), అబ్దుల్ కలాం, టెండూల్కర్, అమితాబ్ అని ఇలా సెలెబ్రిటీల పేర్లతో పిలుస్తారు. ఈ తాత చేసిన కృషికి ఇతనకు 2008లో పద్మశ్రీ అవార్డు దక్కింది. యూఏఈ, ఇరాన్ వంటి దేశాలు కలీముల్లా తాతయ్యను గౌరవించాయి. 2002లో దుబాయ్ లో 10తులాల బంగారు బిస్కెట్ తో కలీముల్లా తాతను సన్మానించారు. తానూ చనిపోయేముందు ఈ 300రకాల మామిడి చెట్టు ఫార్ములాను కేవలం ప్రధాని మోదీకి మాత్రమే తెలియజేస్తానని కలీముల్లా తాత చెబుతున్నాడు.
ఇది కూడా చదవండి..
Share your comments