మామిడి కాయలను ఇష్టపడని వారుండరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ తినేందుకు ఇష్టపడతారు. ఇక చిన్నపిల్లలైతే మహా ఇష్టంతో వీటిని తిడతారు. నిగనిగలాడే మామిడి కాయను తింటుంటే తియ్యగా, రుచికరంగా భలే ఉంటుంది. మామిడి రసం ఇక కమనీయంగా ఉంటుంది. మామిడి ముక్కలను నోట్లో వేసుకుని తింటుంటే కమ్మగా ఉంటుంది. అందుకే మామిడి కాయలను అందరూ ఇష్టపడతారు. మామిడి కాయ కనిపిస్తే చాలు.. నోరూ ఊరుతుంది. తినేయాలని అనిపిస్తుంది.
అలాంటి మామిడి కాయలు పండిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు మామిడి రైతులు. తాజాగా దక్షిణ అమెరికా అమెరికా ఖండంలోని కొలంబియా రైతులు అరుదైన రికార్డు సృష్టించారు. బరువైన మామిడి కాయలను పండించి ఏకంగా గిన్నీస్ రికార్డుకెక్కారు. మాములుగా మామిడి కాయలు బరువు అరకేజి వరకు ఉంటాయి. కొన్ని రకాల మామిడి కాయల బరువు అయితే 2 కిలోల వరకు బరువు ఉంటుంది. కానీ 4.25 కిలోల బరువు గల మామిడి కాయలను ఎప్పుడైనా చూశారా?
కొలంబియాకు చెందిన ఇద్దరు రైతులు ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి కాయలను పండించారు. వీటి బరువు 4.5 కిలోలు. కొలంబియాలోని గ్వాయత్ ప్రాంతానకి చెందిన జెర్మేన్ ఓర్లాండో బరేరా, రీనా మారియా అనే రైతులు అత్యంత బరువైన ఈ మామిడి కాయలను పండించారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఇంత బరువైన మామిడి కాయలను పండించలేదు.
ఇప్పటివరకు ఫిలిప్పీన్స్ కు చెందిన రైతులు 3.435 కిలోల గల మామిడికాయలను పండించారు. ఇప్పుడు ఆ రికార్డులను కొలంబియా రైతులు బ్రేక్ చేసి గిన్నీస్ బుక్కుకెక్కారు. గన్నీస్ బుక్కుకెక్కడం చాలా ఆనందంగా ఉందని ఈ ఇద్దరు రైతులు చెబుతున్నారు. గ్వాయత్ ప్రాంత ప్రజలకు ఈ గిన్నీస్ రికార్డును అంకితమిస్తున్నట్లు తెలిపారు.
కాగా ,గతంలో గ్వాయత్ ప్రాంతంలో 3,199 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సహజసిద్ధ ఫ్లవర్ కార్పెట్ ను తలపించేలా పువ్వులను సాగు చేసి గిన్నీస్ రికార్డు సృష్టించారు. గ్వాయత్ ప్రాంతం సాధారణంగా మామిడి కాయలకు ప్రసిద్ధి.
Share your comments