ప్రస్తుత కాలంలో చాలా మంది యువకులు వ్యవసాయం పై ఉన్న మక్కువతో చేస్తున్నటువంటి ఉద్యోగాలకు రాజీనామా చేసి సరికొత్త ఆలోచన విధానాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను తీసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు తన పొలంలో కీరదోస సాగు చేసి నాలుగు నెలల్లో ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలను లాభం పొందాడు. ఈ క్రమంలోనే నెలకు రెండు లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు.
యూపీకి చెందిన ఈ రైతు నెదర్లాండ్స్ నుండి కీర దోసలను పండించాడు. దీని కోసం, అతను నెదర్లాండ్స్ నుండి కీర దోస విత్తనాలను తెప్పించి తన పొలంలో సాగు చేశాడు. విత్తనాలు లేనటువంటి ఈ కీరదోస సాగు చేయడంతో ఈ దోసకు హోటళ్లు రెస్టారెంట్లలో భారీగా డిమాండ్ ఏర్పడింది.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి కీరదోస సాగు చేయడం కోసం ఉద్యాన శాఖ నుంచి 18 లక్షలు రుణం పొంది ప్రత్యేకంగా సెడ్‌నెట్ హౌస్‌ను సిద్ధం చేసి కీరదోస సాగు చేస్తున్నాడు.
నెదర్లాండ్ నుంచి వచ్చిన ఈ రకమైన కీరదోస మన భారతదేశంలో పండే కీరదోస కన్నా రెండు రెట్లు అధికంగా ధర పలుకుతోంది.భారతీయ కీరదోస కిలో 20 రూపాయలు చొప్పున ఉంటే నెదర్లాండ్ రకం కిలో 40 నుంచి 45 వరకు ధర పలుకుతోంది. రెస్టారెంట్లలో పలు సలాడ్లు తయారీలో ఈ కీరదోసను వాడటం వల్ల దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంది.ఈ క్రమంలోనే ఈ రైతు ప్రత్యేకమైన రకాన్ని తప్పించి సాగు చేయడం వల్ల ప్రతి ఏటా 2 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు.
Share your comments