భారతదేశంలో సహజంగా ఉత్పత్తి అయ్యే నవరత్నాల్లో ఒకటైన ముత్యాలకు, వీటితో తయారు చేసే ఆభరణాలకు విదేశీ మార్కెట్లో సైతం మంచి డిమాండ్ ఉండడంతో ముత్యాల సాగు చేస్తున్న రైతులు సంవత్సరం పొడవునా నిలకడైన ఆదాయాన్ని పొందుతున్నారు. దీంతో చాలా మంది రైతులు, నిరుద్యోగ యువత సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ముత్యాల సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.
అలాంటి వారిలో ఒకరైన సంజయ్ గండతే
మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సాధారణ సాంప్రదాయ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి.
ఈయన ఎన్నో ఉన్నత చదువులు అభ్యసించి సరైన ఉద్యోగం లభించకపోవడంతో నిరుత్సాహపడకుండా ఏదైనా సాధించాలన్న ఉద్దేశంతో 7 సంవత్సరాల క్రితం వినూత్నంగా ఆలోచించి ముత్యాల సాగును చేపట్టి ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాగే సంజయ్ తన ఇంటిలో ముత్యాల పెంపకం కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరికొందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు.
సంజయ్ తన గ్రామ సమీపంలో ఉన్న నదిలో ఎక్కువగా లభించే ఆల్చిప్పల నుంచి ముత్యాలను తయారు చేయవచ్చు అన్న విషయాన్ని సమీపంలోని వ్యవసాయ కేంద్రాల నుంచి తెలుసుకుని సరస్సును అద్దెకు తీసుకొని ముత్యాల సాగును ప్రారంభించాడు. సంజయ్‌కు ఇది వినూత్న వ్యవసాయం కాబట్టి ప్రారంభంలో బాధపడాల్సి వచ్చింది. మత్యం చిప్పల చాలా వరకు చనిపోయాయి. కొంత ఆర్థిక నష్టం కలిగిన నిరుత్సాహ పడకుండా మరికొంత సమాచారాన్ని ఇంటర్నెట్, అనుభవజ్ఞులైన వారి దగ్గర నుంచి సేకరించి మళ్లీ ముత్యాల పెంపకాన్ని ప్రారంభించారు.
నేడు సంజయ్ ఇంట్లో ఐదువేల ఆల్చిప్పలతో ఒక చెరువును నిర్మించాడు.ఇప్పుడు డజనుకు పైగా డిజైన్‌లలో వివిధ రకాల ముత్యాలను తయారు చేస్తు ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి అందుబాటులో ఉంచారు. అలాగే సంజయ్ సొంత వెబ్ సైట్ ను ప్రారంభించి ఆన్లైన్ షాపింగ్ సౌకర్యం కల్పించాడు.చాలా మంది ఫోన్ ద్వారా ఆర్డర్లు కూడా ఇస్తారు. క్యారెట్ ముత్యపు ధర 1200-1500 చొప్పున విక్రయిస్తూ ఏడాదికి దాదాపు 10 లక్షల పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు. అలాగే ముత్యాల సాగులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి చాలామంది రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు.
Share your comments