Success Story

పసుపు పంటలో గుజరాత్ రైతులు అద్భుతం.. ఎకరానికి రూ.3 కోట్ల ఆదాయం

KJ Staff
KJ Staff
turmeric crop
turmeric crop

సాధారణంగా వ్యవసాయం చేయడం కాదు.. పంటలు పండించడంలో కూడా రైతులు రికార్డులు సృష్టిస్తున్నారు. వినూత్నంగా పంటలు పండిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి కూడా ఎక్కువుతున్నారు. పంటలు పండించడంలో రికార్డులు సృష్టిస్తూ పలు అవార్డులు కూడా గెలుచుకుంటున్నారు. రసాయనాలు, ఎరువులు వాడకుండా సహాజ పద్దతిలో వ్యవసాయం చేస్తూ ఆరోగ్యానికి మేలు చేసే విధంగా పంటలు పండిస్తున్నారు రైతులు. దీని ద్వారా మంచి దిగుబడి సాధిస్తూ లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది రైతులు.

తాజాగా గుజరాత్ రైతులు అద్భుతం సృష్టించారు. అధిక దిగుబడి వచ్చే పసుపు పంటలను పండించారు. గుజరాత్ లోని సాబర్ కంఠా జిల్లాలోని రూపాల్ కంపా గ్రామానికి చెందిన రైతులు గ్రీన్‌హౌజ్ ఫార్మింగ్- ఇజ్రాయెల్ విధానంలో పసుపు పంట పండిస్తూ రూ.కోట్లలో ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ఈ విధానం ద్వారా పంట పండించడం ద్వారా ఎకరా పసుపు పంటకు రూ.3 నుంచి రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.

ఎకరానికి 500 నుంచి 800 టన్నుల పసుపు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. ఈ పద్దతి ద్వారా ఎరువులు, నీటికి చేసే ఖర్చు తగ్గుతుందని, పెద్ద మొత్తంలో దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో ఈ పంట పండించవచ్చని చెబుతున్నారు.

గ్రీన్‌హౌజ్ ఫార్మింగ్- ఇజ్రాయెల్ విధానం అంటే ఏమిటి?


-షెడ్డులో సాగు చేస్తూ.. ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావం నుంచి పంటను రక్షించుకునే పద్ధతిని గ్రీన్ హౌజ్‌ టెక్నిక్ అంటారు.

-గ్రీన్‌హౌజ్‌లో నేలను క్రమ పద్ధతిలో చదును చేసి గాల్వనైజ్డ్ ట్రే సిస్టమ్‌లో పసుపు మొక్కలు నాడటారు.
-షెడ్డులో నాలుగు, ఐదు వరుసలు ఉండే నిలువు ట్రేలు ఏర్పాటు చేసి.. వాటిలో చిన్న డబ్బాల్లో మొక్కలు పెంచుతారు.
-మొక్కలకు డ్రిప్ సిస్టమ్‌ ద్వారా నీరు అందిస్తారు

తొలుత రూపాల్ కంపా గ్రామానికి చెందిన చంద్రకాంత్ పటేల్ అనే రైతు ఈ టెక్నిక్ ద్వారా పసుపు పంట పండించాడు. రూ.10 కోట్లతో గ్రీన్ హౌజ్ ఏర్పాటు చేసి పసుపు పంట వేశాడు. ఎకరానికి రూ.3 కోట్ల ఆదాయం రావడంతో మిగతా రైతులు కూడా ఈ విధానం వైపు ఆసక్తి చూపారు. ప్రస్తుతం సాంబర్ కఠా జిల్లాలోని చాలామంది రైతులు ఈ విధానంలో పసుపు పంట పండిస్తున్నారు.

అయితే గ్రీన్ హౌజ్ ఏర్పాటుకు చాలా ఖర్చు అవుతుందని, ప్రభుత్వాలు రాయితీ ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే మరింతమంది రైతులు ఆసక్తి చూపుతారని చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More