సాధారణంగా చాలా మంది ఏం చేయాలో తోచని క్రమంలో సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి వాటిని ఓపెన్ చేసి సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. కానీ ఇదే ఫేస్ బుక్ కొందరికి ఎన్నో పాఠాలను కూడా నేర్పుతుంది. ఈ విధమైనటువంటి కోవకు చెందుతాడు.గణేశ్ కులకర్ణి ఫేస్ బుక్ ద్వారా మిద్దె పై ఎలా పంటలను సాగు చేయాలి అనేది నేర్చుకొని తన మీద పై ఏకంగా 200 రకాల పంటలను పండిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్. అక్కడే లైబ్రేరియన్ గా పనిచేసే గణేష్ కులకర్ణి అనే వ్యక్తికి గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఎప్పుడు మొక్కలను ఏ విధంగా పెంచాలి అనే వాటిపై ఎక్కువ ధ్యాస ఉంచి కొన్ని రకాల మొక్కలను ఇంటికి తెచ్చి నాటేవాడు.అయితే అది కొన్ని రోజులకు మాత్రమే చనిపోవడంతో అసలు గార్డెనింగ్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాలను ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని వెంటనే తన మిద్దె పై గార్డెనింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశాడు.
అర్బన్ గార్డెనింగ్ కు సంబంధించిన అన్ని విషయాలను ఫేస్ బుక్ ద్వారా తెలుసుకొని తన ఇంటి పై మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సుమారు రెండు వందల రకాల కూరగాయలు, పండ్లు, పువ్వులు వంటి మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొక్కలను పెంచడం ద్వారా అన్ని స్వయంగా ఇంట్లోనే పండించుకుంటున్నట్లు గణేష్ కులకర్ణి తెలిపారు.ఈ క్రమంలోని సేంద్రియ ఎరువులను ఉపయోగించి మొక్కలకు సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పట్టడం వాటి సంరక్షణ బాధ్యతలు చూడటం తనకెంతో ఆనందంగా ఉందని గణేష్ కులకర్ణి తెలిపారు.గణేష్ కులకర్ణి ఈ విధంగా మొక్కలను పెంచడంతో ఇతని బాటలో మరికొంతమంది గార్డెనింగ్ కోసం ఏర్పాట్లు చేయడం గమనార్హం.
Share your comments