Success Story

ప్రకృతిలో...ప్రకృతితో సేద్యం

CH Krupadevi
CH Krupadevi

ప్రకృతి లోనైనా, జీవన విధానాలలో నైన,మార్పులు అనేవి సహజం. కానీ, ఆ మార్పులను స్వీకరించడమే ఓ సవాలుగా మారుతుంది. అలాంటి మంచి పరిణామమే ఆధునిక యుగంలో కూడా మొదలైంది. చాలా మంది అన్నదాతలు  ప్రకృతి పై అవగాహన పెంచుకుని,  వ్యవసాయ విధానాలను, ప్రకృతి లో దాగిఉన్న ఔషధాలతో ప్రకృతి సిద్ధమైన ఆరోగ్యకరమైన పంటలను పండించడం మొదలుపెట్టారు.  అలాంటి మహానుభావులలో  ఒక్కరూ డాక్టర్. సుభాష్ పాలేకర్ గారు  ప్రకృతిలో ప్రకృతితో వ్యవసాయం చేస్తున్నాడు.

పంటల పెట్టుబడి వ్యయాన్ని సున్నాకు తీసుకురావడమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుని, ప్రకృతి పిలుస్తోందంటూ వ్యవసాయాన్ని చేయడం మొదలుపెట్టాడు. 18 సంవత్సరాల క్రితం దీనిని ఒక ఉద్యమంలా చేపట్టాడు.

అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటో తెలుసుకుందాం....

పంటల సాగులో   దేశవాళి ఆవు మూత్రం, ఆవుపేడతో,  ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, తయారుచేసుకుని ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులను వాడకుండా  చేసేదానిని ప్రకృతి వ్యవసాయం అంటారు.

ప్రకృతి వ్యవసాయ ప్రక్రియను రూపొందించడంలో సుభాష్ పాలేకర్ గారు తన జీవితాన్నే ధారపోసాడు. అన్నదాత కష్టం చూడలేక, ఓ లక్ష్యాన్ని తనభుజాలపై వేసుకోని తన సర్వస్వాన్ని కోల్పోయినా,ఎన్ని అవమానాలు ఎదురైనా, తన ఆశయాన్ని మాత్రం వదులుకోని ఓ వ్యవసాయ తపస్సిగా మిగిలిపోయాడు.

ప్రభుత్వాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు,వారి కుటుంబం పైన బహిష్కరణ విధించినా, పట్టుసడలని సంకల్పంతో ముందడుగు వేసి జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు పరిచయం చేశాడు.

రైతులు ఏ పరిస్థితులలోనూ మార్కెట్ నుండి బెల్లం, శెనగపిండి, వంటి వాటికి డబ్బు చెల్లించకుండ, అంతర పంటల ద్వారా వాటికి కావలసిన పెట్టుబడిని సమకూర్చుకోవాలి. దీనినే పెట్టుబడి లేని వ్యవసాయం అంటారు.కానీ నేడు చాలా మంది రైతులు బెల్లం, శనగ పిండి, వంటివాటికి సొంత డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.దానిని పెట్టుబడిలేని వ్వవసాయం అనరు.

మామిడి, సపోటా, బత్తాయి, నిమ్మ, కోబ్బెర, పోకచెక్క, జీడిమామిడి, అరటి, సీతాఫలం, దానిమ్మ, మొదలైన తోటలను సాంకేతిక పద్దతులను ఉపయోగిస్తూ,  వేలాదిమంది రైతులు పెంచుతున్నారు. నేడు లక్షల మంది యువరైతులు పాలేకర్ వ్యవసాయ విధానాలను పంటలను సాగుచేస్తున్నారు. కానీ, వారు ఘనజీవామృతం తయారుచేసుకోవడానికి కావల్సిన బెల్లం, శెనగపిండిని సొంతంగా ఖర్చు పెట్టి కొనుక్కోవల్సి వస్తుంది. కాబట్టి, ప్రభుత్వాలు ఇలాంటి ప్రకృతి సేద్యం చేసే రైతులను ప్రోత్సాహించి, వారికి బెల్లం, శనగపిండికి సబ్సిడిలను అందించగలిగితే రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించవచ్చు.

Related Topics

sedyam prakruthi

Share your comments

Subscribe Magazine

More on Success Story

More