యువతలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు వ్యవసాయం, పాడి రంగం అంటే పెద్దవారే చేయాలనే భావవ ఉండేది. కానీ ఇప్పుడు యువత కూడా వ్యవసాయం వైపు ఆసక్తి పెరుగుతోంది. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలను కూడా వదిలేసి వ్యవసాయం చేయడానికి సిద్దమవుతున్నారు.
ఇప్పుడు అలాంటి ఒక యువ రైతు కథ తెలుసుకుందాం. సాప్టీ్ వేర్ జాబ్‌ను కాదనుకుని వదిలేసి పాడి పరిశ్రమ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు సాప్ట్ వేర్ జాబ్ చేసే ఉద్యోగికి వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. మేడ్చల్ జిల్లాకు చెందిన కల్యాణ్ ఏంసీఏ చదువుకుకుని సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. కానీ అతడికి ఉద్యోగంలో సంతృప్తి లభించలేదు. ఏదైనా వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించుకోవడంతో పాటు సంతృప్తి లభిస్తుందని అనుకున్నాడు.
దానికి వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమను ఎంచుకున్నాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా పాడి పరిశ్రమ గురించి స్టడీ చేశాడు. అనంతరం 30 ఎకరాల స్థలంలో ఆర్గానిక్ డైరీ ఫాంను ప్రారంభించాడు. తనకు సొంత పోలం లేకపోవడంతో కౌలుకు తీసుకుని ప్రారంభించాడు. ఇందులో దేశీయ ఆవులు, గేదెల ఫాంని ప్రారంభించాడు.
ఆవు, గేదె పాలను విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఫాంలో 130 దేశీ ఆవులు, గెదెలు ఉన్నాయి. దీని ద్వారా 25 మందికి అతడు ఉపాధి కల్పిస్తున్నాడు. తాజా పాలను వినియోగదారులకు అందించడమే తన లక్ష్యమని కల్యాణ్ చెబుతున్నాడు. ఇక హర్యానా నుంచి ముర్రా గేదెలు, మహారాష్ట్ర నుంచి జాఫరాబాడీ, బన్నీ జాతుల గేదెలను దిగుమతి చేసుకుని పెంచుతున్నాడు.
ఈ గేదెలు 12 నుంచి 13 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయని కల్యాణ్ చెబుతున్నాడు. యువత పాడి రంగం వైపు ఆసక్తి చూపాలని కల్యాణ్ కోరుతున్నాడు. దీని వల్ల లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నాడు.
Share your comments