రైతులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీని వల్ల ఆకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ముందే తెలుసుకోవడం ద్వారా జాగ్రత్తలు తీసుకుని పంటను వీలైనంత కాపాడుకోవచ్చు. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. ఆకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకే రైతులు పత్రికలు, టీవీల ద్వారా వెదర్ అప్డేట్స్ ను ప్రతిరోజూ చేసుకుంటూ ఉండాలి. అలాగే వ్యవసాయ అధికారులను సంప్రదించి వర్షం పడితే పంట నష్టపోకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకోవాలి.
అయితే వాతావరణ సమాచారాన్ని విశ్లేషించి ఖచ్చితంగా అందించే పత్రికలు, ఛానెళ్లు లేవు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు ఒకలా...మరికొన్ని పత్రికలు, ఛానెళ్లు మరోలా చెబుతున్నారు. దీంతో ఏది నమ్మాలో తెలియక రైతులు కన్ ప్యూజన్ అవుతున్నారు. వర్షాలు పడతాయనే సమాచారంతో కొంతమంది పంట వేస్తారు. తీరా పంట వేసిన తర్వాత వర్షాలు పడవు. అలాగే వర్షాలు పడవనే సమాచారంతో చేనికి నీళ్లు పెడతారు. తీరా చేనికి నీళ్లు పెట్టిన తర్వాత భారీ వర్షాలు పడతే పంట నష్టపోయే అవకాశముంది.
ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు ఒక సాప్ట్ వేర్ ఇంజినీర్ ముందుకు వచ్చాడు. రైతులకు ఖచ్చితంగా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అనే యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించాడు 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాయి ప్రణీత్. వివిధ వెబ్ సైట్లు అందించే వాతావరణ వివరాలను అధ్యయనం చేసి ఖచ్చితంగా వాతావరణ వివరాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందిస్తున్నాడు.
ఇక ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో కూడా తన వీడియోలు పెడుతున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో జావా, పైథాన్ ఉపయోగించి న్యూ కోడ్ రాశాడు. దాని సహాయంతో వివిధ వెబ్ సైట్లు అందించే వాతావరణ వివరాలను ఒకేచోట లభించేలా చేశాడు. దాని ద్వారా జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని రైతులకు తెలియజేస్తున్నాడు. మైక్రో మెసేజ్ లతో డిజిటల్ మ్యాప్ లను ఉపయోగించి ఖచ్చితమైన సమాచారం ఇస్తున్నాడు.
ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానెల్ కు 6 వేలకుపైగా సబ్ స్కైబర్స్ ఉన్నారు. దీనికి గాను అతడి గురించి యూఎన్ హాబిటాట్ జర్నల్ జూన్ సంచికల్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సాయి ప్రణీత్ కు చిన్నప్పటి నుంచి వాతావరణ సమాచారం అంటే ఇష్టం. టీవీలు, పత్రికల్లో వచ్చే వాతావరణ వివరాలను చూసేవాడు. వాతావరణ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు.
దీంతో సాయి ప్రణీత్ కు వాతావరణ సమాచారం, ఎలా అనే దానిపై ఫుల్ నాలెడ్జ్ ఉంది. దీంతో విశ్లేషణ చేసి ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తున్నాడు. ఒకవైపు సాప్ట్ వేర్ జాబ్ చేస్తూనే మరోవైపు రైతులకు ఇలా సాయం అందిస్తున్నాడు. రైతులు పంట నష్టపోకుండా ఖచ్చితైన వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని సాయి ప్రణీత్ చెబుతున్నాడు.
Share your comments