Success Story

PADMA AWRDS 2022 : సేఠ్పాల్ సింగ్, అభ్యుదయ రైతుకు పద్మశ్రీ పురస్కారం!

Srikanth B
Srikanth B
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ  పురస్కారం అందుకుంటున్న రైతు !
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న రైతు !

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. వారిలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సేఠ్ పాల్ సింగ్ అనే రైతు ఒకరు, వ్యవసాయం లో తాను చేసిన కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

సహరాన్ పూర్ లోని నంది ఫిరోజ్ పూర్ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు సేఠ్ పాల్ సింగ్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అత్యున్నత పౌర పురస్కారం - 21న పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.21 మార్చి 2022 లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో. కృషి జాగరణ్ తో మాట్లాడుతూ , సేఠ్ పాల్ సింగ్, తనకు ఈ పురష్కారం లభించడం పై హర్షం వ్యక్తం చేసారు ,మరియు తనకు ఈ పురస్కారం లభించడానికి  సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల జాబితాలో నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 34 మంది మహిళలు ఉన్నారని, ఈ జాబితాలో విదేశీయులు/ ఎన్ఆర్ఐ/ పీఐఓ/ ఓసీఐ కేటగిరీకి చెందిన 10 మంది, మరణానంతరం అవార్డు గ్రహీతలు 13 మంది ఉన్నారు.

సేఠ్పాల్ సింగ్ - వేలాది మంది రైతులకు స్ఫూర్తి!

గిరిజన కళలు మరియు జానపద సంగీతం నుండి సాంప్రదాయ హస్తకళలు మరియు సాహిత్యం వరకు రంగాలలో వారి అసాధారణ కృషికి అందుకొనే వేదిక పై .  ఒక్క చిన్న రైతుకు  వ్యవసాయ రంగంలో సుస్థిరమైన ఆదాయం కోసం కృషిచేసిన సేఠ్ పాల్ సింగ్ ఈ  పురస్కారం అందుకోవడం మిగిలిన రైతులందరికీ స్ఫూర్తిదాయకం .

వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేసినందుకు గతంలో అనేక జాతీయ స్థాయి అవార్డులను కూడా అందుకున్న ఆయన ఇప్పుడు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం ఆయన సాధించిన విజయాల జాబితాలో మరో విశేషం.

2012లో ఐసీఏఆర్ ద్వారా ఇన్నోవేటివ్ కిసాన్  సమ్మాన్, 2014లో జగ్జీవన్ రామ్ అభినవ్ కిసాన్ అవార్డు అందుకున్నారు. మళ్లీ 2020లో ఫెలోషిప్ అవార్డు లను అందుకున్నారు.

సేఠ్ పాల్ సింగ్ వ్యవసాయాన్ని రంగం లో  ప్రయోగాలు చేసి, నూతనంగా ఆవిష్కరించిన మార్గదర్శకులలో ఒకరు, ఉదాహరణకు, అతను చెరువులో కాకుండా పొలంలో "వాటర్  చెస్ట్ నట్" లను ఉత్పత్తి చేస్తాడు.

తన పొలంలో, తామర పువ్వులు, కూరగాయలు, చేపలు, పశుపోషణ, అలాగే పుట్టగొడుగుల ఉత్పత్తిలో విస్తృతంగా పాల్గొంటున్నాడు. చెరకుతో పాటు, అతను ఉల్లిపాయ, బంగాళాదుంప, ఆవాలు, కాయధాన్యాలు, ఇంకా పసుపును సాగు చేస్తాడు.

ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రుద్రసేన్, కృషి విజ్ఞాన కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ ఐకే కుష్వాహా, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్, యువ గుర్జార్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గుర్జార్ సేఠ్పాల్ సింగ్కు పద్మశ్రీ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కనీస మద్దతు ధర కోసం మరో ఉద్యమం .. 25 రాష్ట్రాల రైతుసంఘాల సమావేశం ! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on Success Story

More