తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSPDCL )లో జూనియర్ లైన్ మెన్ (JLM ) గా నియమితులైన తొలి మహిళగా బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించింది. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.
“TSSPDCLలో JLM పోస్ట్‌కి ఎంపికైన మొదటి మహిళ కావడం నాకు గర్వకారణం. స్త్రీలు పురుషుల కంటే తక్కువేమీ కాదని, అన్ని రంగాల్లో రాణించగలరని ఈ పదవికి నా ఎంపిక నిరూపిస్తోంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డికి, కంపెనీకి ధన్యవాదాలు. నా పని ద్వారా నా SPDCL గర్వపడేలా చేస్తాను” - అని శిరీష తెలిపారు .
సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష మేడ్చల్ మల్కాజిగిరిలో తన విద్యను పూర్తి చేసింది TSSPDCLలో JLM పోస్టు కోసం ఇటీవల జరిగిన రిక్రూట్‌మెంట్‌లో పోస్ట్‌ను పొందిన ఏకైక మహిళ ఆమె. రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల్లో కూడా ఆమె ఒక్కరే పదవిలో ఉన్నారు. తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ట్రాన్స్‌కో)లో జేఎల్‌ఎం పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో 200 మంది మహిళలను నియమించింది.
Link your Aadhaar card with ration card: రేషన్ కార్డు ను ఆధార్ కార్డ్‌లతో లింక్ చేయడనికి గడువు పెంపు !
జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో మహిళలు కొత్త బాటలో పయనిస్తూ జేఎల్‌ఎం పోస్టులో నియామకాలు చేపట్టడం ఎంతో స్ఫూర్తి దాయకం , లైన్‌మెన్ పోస్టుల్లో మహిళలను కూడా నియమిస్తున్నందున గతంలో సూచించిన విధంగా లైన్‌మెన్ పోస్టుల నామకరణాన్ని మార్చి లింగభేదం లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Share your comments