ప్రజల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. సమాజంలో అవగాహన పెరగడం, జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడిపోతాయో అర్థం కాకపోవడం వల్ల వ్యవసాయం వైపు కొంతమంది యువత ఆసక్తి చూపుతోంది. వ్యవసాయం అంటే పెద్దవారే చేయాలా?. అనే ప్రశ్న నుంచి ఇప్పుడు యువత వ్యవసాయం ఎందుకు చేయకూడదు? అనే ప్రశ్న వరకు వచ్చింది. కొంతమంది యువత లక్షల్లో వచ్చే సాప్ట్ వేర్ జాబ్‌ని వదిలేసి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.
పర్యావరణం మీద ఉన్న ప్రేమతో, సాంప్రదాయ వృత్తి అయిన వ్యవసాయం చేయాలనే ఆలోచన క్రమక్రమంగా యువతలో పెరిగిపోతుండటం శుభ పరిణామమని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సాఫ్ట్ వేర్ దంపతుల సక్సెస్ స్టోరీనే.
విదేశాల్లో లక్షల్లో జీతం వచ్చే సాప్ట్ వేర్ కోలువు. భార్యాభర్తలిద్దరిది సాప్ట్ వేర్ జాబ్‌నే. హైడ్రోపోనిక్స్ అనే నూతన వ్యవసాయ పద్దతిని నేర్చుకుని ఇక్కడికి వచ్చి లక్షల్లో సంపాదిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సాప్ట్ వేర్ దంపతులు సచిన్ దర్బార్వర్, శ్వేత దర్బార్వర్ కొంతకాలం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జాబ్ చేశారు. అక్కడ హైడ్రోపోనిక్స్ వ్యవసాయం గురించి బాగా తెలుసుకున్నారు. మన సొంత ఊరికి వెళ్లి ఇలాంటి వ్యవసాయాన్ని ఎందుకు చూయకూడదనే ఆలోచన వచ్చింది.
దీంతో అక్కడ నుంచి తిరిగి వచ్చి హైడ్రోపోనిక్స్ వ్యవసాయంతో ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శామీర్ పేట దగ్గర ఐదు ఎకరాల్లో తొలుత తాజా ఆకుకూరల్ని పండించారు. ఆ తర్వాత అర్జునపట్ల గ్రామంలో 150 ఎకరాల్లో సింప్లీ ప్రెష్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. పండే పంటలను ముంబై, చెన్నై, వైజాగ్‌కు ఎగుమతి చేస్తున్నారు.
హైడ్రోపోనిక్స్ వ్యవసాయం అంటే ఏమిటి?
హైడ్రోపోనిక్స్ వ్యవసాయం అనేది విదేశాల్లో బాగా పాపులర్ అయింది. ఇప్పడిప్పుడే ఈ నూతన వ్యవసాయ పద్దతి ఇండియాలోకి అడుగుపెడుతోంది. ఈ పద్దతిలో వ్యవసాయం చేయాలంటే మట్టి అవసరం లేదు. నీటి అవసరం కూడా చాలా తక్కువ. ఇక క్రిమిసంహరక మందుల ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. మట్టి అవసరం లేకుండా కొబ్బరి పీచుతో తయారుచేసిన కోకోపిట్‌ను ట్రేలలో పరిచి అందులో విత్తనాలు వేస్తారు.
ట్రేలను నీళ్లతో తడిపితే చాలు. ఇక మెలకలు వచ్చి తర్వాత డ్రిప్ పద్దతిలో నేరుగ వేళ్లకే సాగునీరు అందిస్తారు. ఇక మొక్కలు పెరగడానికి అవసరమయ్యే నత్రజని, క్యాల్షియం, జింక్, ఐరన్ వంటివన్నీ డ్రిప్ ద్వారా అందిస్తారు.
Share your comments