వ్యవసాయం చేయడం చాలా కష్టతరమైన పని. విపత్తులను ఎదుర్కొంటూ ఎండ, వాన, చలిలో పని చేయాల్సి ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్ లో కష్టపడాల్సి ఉంటుంది. ప్రతి చేతికి వచ్చేంత వరకు రైతులకు టెన్షన్ ఉంటుంది. ఆకాల వర్షాలు, తెగులు, పురుగులు నుంచి పంటను కాపాడుకోవాల్సి ఉంటుంది. రోజూ పోలంకు వెళ్లి చూడాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. వేలల్లో పెట్టుబడి అవుతుంది. ఎరువులు, రసాయనాల ఖర్చు చాలా ఉంటుంది. దానికి తోడు కూలీల ఖర్చు చాలా ఉంటుంది.
ప్రకృతి వైఫరీత్యాలు, ఆకాల వర్షాలు, తెగుళ్లు, పరుగుల వల్ల పంట నష్టపోతే రైతులకు మిగిలేది ఇక అప్పులే. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే రైతులు వ్యవసాయాన్ని అసలు వదులుకోరు. అప్పులైనా సరే వ్యవసాయాన్ని నమ్ముకునే ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దానికి ఉదాహరణగా ఈ సంఘటన నిలుస్తుంది. వ్యవసాయం కూడా ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు అక్కడి రైతులు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసకుందాం.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని కుమ్మనూర్ గ్రామానికి చెందిన రైతులు నదిని దాటుకుంటూ వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. ఆ గ్రామానికి సమీపాన పెన్నై నది ఉంది. పోలాలకు, గ్రామానికి మధ్య ఈ నది ఉంది. దీంతో పోలాలకు వెళ్లాలంటే ఆ నది దాటుకోని వెళ్లాల్సింది. బ్రిడ్జి కట్టించాలని రైతులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా.. ఇప్పటివరకు వారి కోరిక తీరలేదు. దీంతో నదిలో పీకల్లోతు మునిగిపోయి అలాగే నడుచుకుంటూ వెళ్లి సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. వరదలు, తుఫాన్ ల సమయంలో ఈ నదిని దాటి వెళ్లాలంటే మరింత ప్రమాదకరం.
నీటి ప్రవాహాం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా రైతులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిని దాటుతున్నారు. ఈ గ్రామ ప్రజలు 450 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. నదిలో పీకల్లోతు నీటి నడుచుకుంటూ బస్తాలు, ఎరువులు మోసుకుంటూ వెళుతున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వ్యవసాయం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఈ గ్రామ ప్రజలు స్థితిని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదకు నదిలో నీటి ప్రావాహం ఎక్కువగా ఉంది. దీనికి కూడా లెక్క చేయకుకండా రైతులకు తమ పంట పోలాలకు వెళుతున్నారు.
Share your comments