నల్ల బియ్యం మళ్లీ పండించారు.మొదటి సరిగా తెలంగాణ లో వేదవ్యవసాయవేత్త కౌటిల్య కృష్ణన్.
ఈ ఘనత సందించారు.కృష్ణ వ్రీహిబియ్యాన్నిపండించారు.వేదాల ఆధారంగా తాను సాగుచేశాను అందుకే రెండవ సారి విజయవంతంగా తన పొలంలో నల్ల బియ్యాన్ని పండించినట్లు కౌటిల్య కృష్ణన్ తెలిపారు.ఎకరానికి 2లక్షల చొప్పున 3 ఎకరాలకు 6లక్షలు అలాగే పంట వ్యవధి కాలం ఆరు నెలలు కాబట్టి సంవత్సరం లో రెండు పంటలు వేసి సంవత్సర కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నాడు కృష్ణ.
నాటు విత్తనాలు వాడటం ద్వారా పురుగులు వచ్చే శాతం తక్కువ. రుచి బాగుంటుంది. విత్తనాలు వంద శాతం మొలకెత్తే అవకాశం ఉంటుంది.భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా అవసరం లేదు. ఎలాంటి భూమిలోనైనా పంట బ్రహ్మాండంగా పండుతుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. రైతన్నలు నాటు విత్తనాలు నిల్వ చేసుకుని తదుపరి పంటకు మళ్లీ వేసుకోవచ్చు. దేశీయ విత్తనాల్లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ విత్తనాలు వాడటం వల్ల ఆర్ధికంగా కూడా రైతులు లాభపడతారు. దేశీయ విత్తనాల వల్ల అన్నదాతలు ఆర్ధికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
ఇతర రకాల బియ్యంతో పోలిస్తే, బ్లాక్ రైస్ ప్రోటీన్లలో అత్యధికంగా ఉంటుంది.
1/4 కప్పు (45 గ్రాములు) వండని నల్ల బియ్యం అందిస్తోంది.
కేలరీలు: 160
కొవ్వు: 1.5 గ్రాములు
ప్రోటీన్: 4 గ్రాములు
పిండి పదార్థాలు: 34 గ్రాములు
ఫైబర్: 1 గ్రాము.
ఐరన్: డైలీ 6%.
Share your comments