Agripedia

వేసవి కాలం జీవాల పెంపకంలో పాటించవలసిన జాగ్రత్తలు

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఎర్ర మాంసానికి డిమాండ్ అధికంగా ఉండటంతో, ఎంతో మంది గొర్రెలు, మేకలు పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు జీవాల పెంపకాన్ని కులవృత్తిగా భావించే వారు. ఇప్పుడు జీవాల పెంపకానికి లభిస్తున్న ఆదరణను గుర్తించి ఎంతో మంది వాణిజ్య రీతిలో వీటిని పెంచుతున్నారు. చాల దేశాల్లో మేక పాలను ప్రత్యేకమైన ఫెటా చీస్ తయారీలో వాడతారు. దీని ధర మాముల ఛీజ్ కంటే ఎక్కువ.

వేసవికాలంలో ఇతర మూగ జీవాల పోషణ మాదిరిగానే, గొర్రెలు మరియు మేకల పెంపకంలో కూడా అనేక సమస్యలు తలెత్తేందుకు ఆస్కారం ఉంటుంది. సరైన పోషణ మరియు మెరుగైన యాజమాన్య పద్దతులు పాటించకుంటే జీవులు రోగాల భారిన పడే ఆస్కారముంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే సమయాల్లో మేకలను బయటకు వదలకపోవడం మంచిది. ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం 4 గంటలు దాటినా తర్వాతే వీటిని మేతకు వదిలిపెట్టాలి. ఉష్ణోగ్రత ఎక్కువుగా ఉన్న సమయాల్లో బయటకు వదిలిపెడితే అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎండ ఎక్కువుగా ఉండే సమయాల్లో షెడ్ లేదా పాకలో ఉంచాలి. కొత్తగా పుట్టిన పిల్లలను షెడ్ వద్దే ఉంచి అవసరమైన పోషణ అందించాలి.

వేసవి కాలంలో జీవాలలు నీరు అధికంగా తాగుతాయి కనుక సరైన నీటి వసతి ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. జీవులు పచ్చి మెట్లమీద ఎక్కువుగా ఆధారపడతాయి. పాడి పశువులకు అందించినట్టుగా సూపర్ నేపియర్, కో1, కో2 మొదలగు రకాల నేపియర్ గడ్డిని పెంచి వీటికి అందిచవచ్చు. జీవాలను పెంచే వారు గడ్డిని పెంచేందుకు కొంత స్థలాన్ని కేటాయించాలి, నేపియర్ రకాలు బహువార్షికలు కనుక 4-5 సంవత్సరాల వరకు దిగుబడి ఆశించవచ్చు. పచ్చిగడ్డి మరియు ఆకులతో పాటు దాణా కూడా అందిస్తే జీవాలకు శరీర ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.

జీవులు వేసవి కాలంలో రోగాల భారిన పడే అవకాశం ఎక్కువ. రాగాలతో పాటు పిడుధులు, గోమార్లు, పొట్ట జలగలు, లాంటివి సోకె అవకాశం ఎక్కువ. ఇవి కనిపించినప్పుడు బ్యూటాక్స్, సైపర్మేథీరిన్, డెల్టామేథీరిన్ మందులు నిర్ధేశించిన పరిమాణంలో నీటిలో కలిపి వీటి మీద పిచికారీచేయాలి. రోగాలు కనిపించిన వెంటనే పశు వైద్యున్ని సంప్రదించి చికిత్స అందించాలి.

Share your comments

Subscribe Magazine