Agripedia

మట్టి సంరక్షణ: మట్టిని పరిరక్షించుకోవడం మన బాధ్యత!!

KJ Staff
KJ Staff

మట్టిని పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు, మత్తిలేనిదే జీవం లేదు. మనం తినే ఆహరం మట్టినుండే పుడుతుంది. మానవమనుగడకు ఇంతలా తోడ్పడుతున్న మట్టిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా వ్యవసాయంలో మట్టిదే ప్రధాన పాత్ర. మట్టిని ఆరోగ్యకరమైనదైతే పంట కూడా ఆరోగ్యంగా పండి, వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది.

అయితే ప్రస్తుతం అధిక మొత్తంలో పురుగుమందులు, రసాయన ఎరువులు వాడటం వలన మట్టి గొడ్రాలిగా మారిపోతుంది. ఇప్పటికే చాల దేశాల్లో మాటి నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. మన భారత దేశంలో కూడా చాల వ్యవసాయ భూములు బీడు భూములుగా మారడానికి రసాయన ఎరువులు కారణమని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా మొక్కకు అవసరమైన వాటికంటే అధిక మొత్తంలో ఎరువులను వాడటం మూలాన వ్యవసాయ క్షేత్రాలు చౌడు నేలలుగా మారుతున్నాయి. సరైన యాజమాన్య పడతులు పాటించని కారణంగా నేల కోతకు గురవుతుంది. ప్రతి ఏడాది సుమారు 75 బిలియన్ టన్నుల మట్టికోతకు గురవుతుంది దీనినే సాయిల్ ఈరోసన్ అంటారు. మట్టితో పాటు వివువైన ఖనిజాలు, పోషకవిలువలు కూడా వృధాగా పోతున్నాయి. మీ వ్యవసాయ భూమిలో మట్టికోతకు గురికాకుండా కొన్ని పద్దతుల ద్వారా నియంత్రించవచ్చు.

పంట మార్పిడి:

మన దేశంలోని ఎంతో మంది రైతులు ప్రతీ ఏడాది ఒకేరకం పంటలు పండిస్తారు. ఒకే పంటను మళ్లీమళ్లీ వెయ్యడం ద్వారా మట్టిలోని పోషకాలు శాతం తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా ఒక పంటకాలంలో మొక్కలను ఆశించిన చీడపీడలు, తరువాతి సీసన్ లో కూడా పంటను నష్టభరుస్తాయి. ఇలా కాకుండా ఒకటి లేదా రెండు సంవత్సరాలకి ఒకేసారి పంటను మార్చి కొత్త పంట పెంచినట్లైతే మట్టినినుండి సంక్రమించే చీడపీడలను నివారించవచ్చు. దీని వలన పురుగుమందుల వినియోగం తగ్గుతుంది. ధాన్యం పండించే పంటలు రైతులు కనీసం రెండుసంవత్సరాలకు ఒకసారైనా పప్పుదినుసులను పండించడం మంచిది. పప్పు ధాన్యాల మొక్కల వేర్లపై పెరిగే ర్హిజోబియం అనే బాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని మట్టిలో స్థిరీకరిస్తుంది. వేసవి కాలంలో కాస్త నీటి తడులు ఇవ్వగలిగిన సామర్ధ్యం ఉన్న రైతులు మినుములు, పెసలు వంటి పండించడం ద్వారా మట్టి కోతను అరికట్టి మట్టిలో పోషకాలను జోడించుకోగలరు.

సహజ ఎరువులు:

రసాయన ఎరువులు అధికంగా వాడిత్ మట్టి సమతుల్యత దెబ్బతింటుంది. మట్టిలోని ప్రయోజకరమైన బాక్ట్రయల్ మరియు వానపాములు వీటి సంఖ్య తగ్గి, భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. రసాయన ఎరువుల వాళ్ళ మరొక్క సమస్య ఏమిటంటే వీటిలో కార్బన్ ఉండదు, మొక్క ఎదుగుదలకు కార్బన్ అవసరం. మట్టిలో ఉన్న కార్బన్ ని మాత్రమే మొక్కలు వాడుకుంటే కొన్ని రోజులకు వ్యవసాయ క్షేత్రం బీడుభూమిగా మారుతుంది. సహజసిద్దమైన ఎరువులు మొక్కకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు, మట్టిలో కార్బన్ శాతాన్ని పెంచుతాయి. పచ్చి రొట్ట ఎరువులు, పశువుల పెంట, వెర్మికంపోస్టు, మొదలైనవి సహజ ఎరువులు. అయితే రసాయన ఎరువులతో పోలిస్తే వీటిని అధిక మొత్తంలో వాడాలి అని గుర్తుపెట్టుకోండి.

విండ్ బ్రేక్స్:

మట్టి కోతకు గురికావడానికి, గాలి మరియు నీరు రెండూ ప్రధాన పాత్రధారులు. పొలంలో మెరుగైన నీటి పారుదల వ్య్వవస్థను ఏర్పర్చడం ద్వారా నీటి ద్వారా జరిగే మట్టికోతను అరికట్టవచ్చు. గాలి ద్వారా సంభవించే మట్టి కోతను ఎయిర్ ఏరోసన్ అంటారు. మట్టి మీద గాలి ప్రభావాన్ని తగ్గించాడనికి పొలం చుట్టు చెట్లు నాటుకోవాలి, వీటిని విండ్ బ్రేక్స్ అంటారు ఈ చెట్లు గాలి వేగాన్ని తగ్గించి మట్టి కోతను నియంత్రిస్తాయి.

Share your comments

Subscribe Magazine